E-Paper
Advertisement

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా
Advertisement

Spiritual Emotional Drama: జీవితంలో అన్నీ కోల్పోయినట్టు అనిపించినప్పుడు, డబ్బు లేకపోవడం, ఆరోగ్య సమస్య, కుటుంబ బంధాలు తెగిపోవడం వంటి బాధలు ఒకేసారి చుట్టుముట్టినప్పుడు ఏదైనా అద్భుతం జరుగుతుందని నమ్మడం తప్ప మరో మార్గం ఉండదు. ఈ నేపథ్యంలో ఒక ఆశ్రమానికి చేరుకున్న ఐదుగురి జీవితాలు ఒక గురువును కలిసిన తర్వాత సాగే ఆధ్యాత్మిక, భావోద్వేగ అంశాలతో ఓ కథ తిరుగుతుంది. ఆ సినిమా పేరే ‘అనంత’ (Anantha). మరి అక్కడికి వెళ్ళాక అసలు కథ ఉంటుంది.

 కథలోకి వెళ్తే…

ఈ కథలో ఒకే రకమైన జీవితాలు ఉన్నవాళ్లు ఉండరు. సమాజంలోని వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చిన ఐదుగురు వ్యక్తులు తమ తమ సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. ఒక్కొక్కరి బాధ ఒక్కో విధంగా ఉంటుంది. ఒక వ్యాపారికి భారీ నష్టం వచ్చి జీవితంపై ఆశ కోల్పోయే పరిస్థితి వస్తుంది. మరో యువతి నయం కాని వ్యాధితో పోరాడుతుంది. ఇంకొక తండ్రి కుటుంబ బంధాలు దెబ్బతినడంతో లోపల నుంచి కుంగిపోతుంటాడు. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక చీకటి కోణం ఉంటుంది.

Advertisement

తమ సమస్యలకు పరిష్కారం కనిపించని సమయంలో వీళ్లందరూ అనుకోకుండా ‘అనంత బాబా’ ఆశ్రమానికి చేరుకుంటారు. మొదట వాళ్లకు ఆ ఆశ్రమం ఒక సాధారణ ఆధ్యాత్మిక ప్రదేశంలానే కనిపించవచ్చు. కానీ బాబా మాటలు, ఆయన చెప్పే విషయాలు, ఆయన చూపించే దైవిక లీలలు వాళ్ల ఆలోచనల్లో నెమ్మదిగా మార్పు తీసుకురావడం మొదలవుతుంది.

బయటి ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే మాయమవ్వడం కంటే, వాటిని ఎదుర్కొనే మనస్తత్వమే ముందుగా మారాలని బాబా చెబుతాడు. భౌతిక సమస్యల మధ్య మానసిక ప్రశాంతతను కోల్పోతే మనిషి మరింత బలహీనపడతాడనే భావన కథలో ప్రధానంగా కనిపిస్తుంది. బాబా మాటలు, స్పర్శతో ఈ ఐదుగురి జీవితాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి.

Advertisement

అయితే కథ ఇక్కడితో సింపుల్‌గా సాగదు. బాబా గురించి అనుమానాలు కూడా మొదలవుతాయి. అతన్ని మోసగాడిగా నిరూపించాలనే ఉద్దేశంతో ఒక నాస్తిక జర్నలిస్ట్ ఆశ్రమంలోకి అడుగుపెడతాడు. బాబా నిజంగా దైవిక శక్తులు కలిగిన వ్యక్తేనా? లేక తనను నమ్ముతున్న వారి మనస్తత్వాన్ని ఉపయోగించుకుంటున్నాడా? అనే ప్రశ్నతో అతని పరిశోధన మొదలవుతుంది.

ఆ జర్నలిస్ట్ అన్వేషణ సాగుతున్న కొద్దీ ఆశ్రమం గురించి, బాబా గురించి, అక్కడికి వచ్చిన వ్యక్తుల జీవితాల గురించి కొన్ని కీలకమైన విషయాలు బయటకు వస్తాయి. అదే సమయంలో ఐదుగురు వ్యక్తుల్లో వచ్చిన మార్పు కూడా కథలో మరో కోణాన్ని చూపిస్తుంది. వారికి కావాల్సింది కేవలం అద్భుతం కాదని, తమ జీవితాలను తిరిగి చూసుకునే ధైర్యమని కథ చెప్పే ప్రయత్నం చేస్తుంది.

చివరికి బాబా చుట్టూ ఉన్న అనుమానాలకు ఎలాంటి సమాధానం దొరికింది? జర్నలిస్ట్ చేసిన పరిశోధన ఏ నిజాన్ని బయటపెట్టింది? ఐదుగురి జీవితాలు చివరకు ఎలా మారాయి? అనే అంశాలే ఈ కథ .

ఓటీటీలో ఎక్కడ స్ట్రీమింగ్?

‘అనంత’ (Anantha) మార్చి 2026లో థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం జియోహాట్‌స్టార్ (Hotstar)లో తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. ఆధ్యాత్మికత, మానవ భావోద్వేగాలు, నమ్మకం, జీవితంలో రెండో అవకాశం వంటి అంశాలతో కూడిన సినిమాలు ఇష్టపడేవారికి ఇది సరిపోతుంది.

Read Also: అవయవాల అక్రమ రవాణా కుట్రను ఛేదించే ఆత్మ… మెంటలెక్కించే మెడికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్

Tags

Related News

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

రాక్షస శక్తుల వలలోపడి రాజ్యాన్ని సర్వనాశనం చేసే చక్రవర్తి… దేవతల ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్…

మంచు తుఫానుతో గడ్డకట్టిపోయే భూగోళం… స్పైన్ చిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్

రిజర్వాయర్ నీళ్లలో నక్కిన భయంకరమైన శక్తులు… వణికించే కొరియన్ ఫోక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

ఇరుముడి నుంచి లస్ట్ ​స్టోరీస్ వరకు… ఈ వారం మిస్ అవ్వకుండా చూడాల్సిన 7 క్రేజీ ప్రాజెక్ట్‌లు

Big Stories

Advertisement
×