E-Paper
Advertisement

ఇరుముడి నుంచి లస్ట్ ​స్టోరీస్ వరకు… ఈ వారం మిస్ అవ్వకుండా చూడాల్సిన 7 క్రేజీ ప్రాజెక్ట్‌లు

ఇరుముడి నుంచి లస్ట్ ​స్టోరీస్ వరకు… ఈ వారం మిస్ అవ్వకుండా చూడాల్సిన 7 క్రేజీ ప్రాజెక్ట్‌లు
Advertisement

OTT Releases: వీకెండ్ వచ్చిందంటే కొత్త సినిమాల కోసం థియేటర్లకంటే ముందుగా ఓటీటీ యాప్స్ వైపు చూసే రోజులు ఇవి. మరి ఈసారి ఒకటో రెండో కాదు.. ఏకంగా ఏడు ప్రాజెక్టులు ఒకే రోజున డిజిటల్ ప్రేక్షకులను పలకరించబోతే? మాస్ హీరో సినిమా నుంచి రొమాంటిక్ స్టోరీ వరకు, మిస్టరీ థ్రిల్లర్ నుంచి విలేజ్ కామెడీ వరకు, యాక్షన్ నుంచి ఫ్యామిలీ డ్రామా వరకు విభిన్నమైన కంటెంట్ ఒకేసారి అందుబాటులోకి వస్తే? సెప్టెంబర్ 18న ఓటీటీ ప్రేక్షకులకు ఇలాంటి బిజీ వీకెండ్‌నే సిద్ధం చేసింది. ‘ఇరుముడి’ (Irumudi), ‘లస్ట్ స్టోరీస్ 3’ (Lust Stories 3), ‘తొడక్కం’ (Thudakkam), ‘మోద రాతిరి’ (Modha Rathiri), ‘రామ్ అండ్ లీల’ (Ram And Leela), ‘అంగీకారం’ (Angikaaram), ‘బెస్ట్ ఆఫ్ ది బెస్ట్’ (Best Of The Best) ఇలా ఏడు ప్రాజెక్టులు వేర్వేరు జానర్లలో వినోదం అందించనున్నాయి. మరి ఈ సినిమాలను ఎప్పుడు, ఎక్కడ చూడచ్చో ఓ లుక్ వేద్దాం పదండి.

 వివరాల్లోకి వెళ్తే…

ముందుగా మాస్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్న చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించగా, శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో విజయాన్ని అందుకున్న తర్వాత డిజిటల్ రిలీజ్‌కు సిద్ధమైంది. సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో చూసిన వాళ్లు మరోసారి చూడాలనుకునే సినిమా కావడంతో పాటు, మిస్ అయిన వాళ్లకు ఇప్పుడు ఇంట్లోనే చూసే అవకాశం వస్తోంది. అదే రోజు ‘లస్ట్ స్టోరీస్ 3’ (Lust Stories 3) కూడా నెట్‌ఫ్లిక్స్ (Netflix)లోకి వస్తోంది. ఇప్పటికే ఈ ఆంథాలజీకి మంచి గుర్తింపు ఉండటంతో కొత్త భాగంపై కూడా ఆసక్తి ఉంది. ప్రేమ, సంబంధాలు, మానవ భావోద్వేగాల చుట్టూ వేర్వేరు కథలను చూడాలనుకునే వారికి ఇది బెస్ట్ సజెషన్.

Advertisement

ఇక తమిళ విలేజ్ కామెడీ డ్రామా ‘మోద రాతిరి’ (Modha Rathiri) కూడా అదే రోజు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. గ్రామీణ నేపథ్యం, హాస్యంతో కూడిన కథలను ఇష్టపడేవారికి ఈ సినిమా ప్రత్యేకమైన ఆప్షన్‌గా నిలుస్తుంది. దీనితో పాటు హాలీవుడ్ యాక్షన్ డ్రామా *‘బెస్ట్ ఆఫ్ ది బెస్ట్’ (Best Of The Best) కూడా నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళం నుంచి వస్తున్న ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ ‘తొడక్కం’ (Thudakkam) కూడా సెప్టెంబర్ 18న జియోహాట్‌స్టార్ (JioHotstar)లో విడుదల కానుంది. రహస్యాన్ని ఛేదించే కథలు ఇష్టపడేవారికి ఇది ఆసక్తికరమైన ఎంపిక. మరోవైపు ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ ‘రామ్ అండ్ లీల’ (Ram And Leela) ప్రైమ్ వీడియో (Prime Video)లోకి రానుంది. ప్రేమకథలతో రిలాక్స్ అవ్వాలనుకునేవారికి ఇది చూడ చక్కని సినిమా.

ఇక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘అంగీకారం’ (Angikaaram) సన్ నెక్స్ట్ (Sun NXT)లో అదే తేదీన స్ట్రీమింగ్ కానుంది. కుటుంబ బంధాలు, భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇచ్చే సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఇది ఉపయోగపడే ఎంపిక. మొత్తానికి సెప్టెంబర్ 18న ఓటీటీలో కంటెంట్ కొరత ఉండదు. ఒకే జానర్‌కు పరిమితం కాకుండా మీ మూడ్‌ను బట్టి సినిమా ఎంచుకునే అవకాశం ఉంది. మాస్ సినిమా కావాలంటే ‘ఇరుముడి’ (Irumudi), థ్రిల్ కావాలంటే ‘తొడక్కం’ (Thudakkam), లవ్ స్టోరీ కావాలంటే ‘రామ్ అండ్ లీల’ (Ram And Leela), ఫ్యామిలీ ఎమోషన్స్ కావాలంటే ‘అంగీకారం’ (Angikaaram).. ఇలా ఈ వారం ఓటీటీ లిస్ట్ చాలా వెరైటీగా ఉంది.

Advertisement

Read Also: అమ్మాయిలను చంపి పెళ్లి కూతుర్లలా అలంకరించే సైకో… సీటు అంచున కూర్చోబెట్టే ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ

Tags

Related News

రిజర్వాయర్ నీళ్లలో నక్కిన భయంకరమైన శక్తులు… వణికించే కొరియన్ ఫోక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

కాశీ యాత్ర నేపథ్యంలో సాగే వినోదాత్మక ప్రయాణం… నవ్వులు పూయించే తెలుగు క్లాసిక్ కామెడీ డ్రామా

ఓటీటీలోకి రవితేజ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

మానవులకు, సైబోర్గ్స్‌కి మధ్య బ్లడీ బ్లడ్ బాత్… భవిష్యత్ ప్రపంచంలో మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

గ్రహశకలం ఢీకొట్టడంతో తెలియని గ్రహంపై క్రాష్ ల్యాండ్… డ్రాగన్లు, రాక్షస డైనోసార్లతో ఊపిరి పీల్చుకోనివ్వని పోరాటం

అరేబియన్ నైట్స్ ఫాంటసీకి భయపెట్టే ట్విస్ట్… ఎపిక్ హర్రర్ సిరీస్ స్ట్రీమింగ్ తెలుగులోనే

ట్రిప్ పేరుతో ఇదేం ట్విస్ట్… కార్పొరేట్ ఆఫీస్ పాలిటిక్స్ కల్చర్‌ను ఎండగట్టిన సినిమా

Big Stories

Advertisement
×