E-Paper
Advertisement

నెలలోపే ఓటీటీలోకి రొమాంటిక్ ఎంటర్టైనర్… కానీ చిన్న ట్విస్ట్

నెలలోపే ఓటీటీలోకి రొమాంటిక్ ఎంటర్టైనర్… కానీ చిన్న ట్విస్ట్
Advertisement

29 OTT Release Date : తమిళ చిత్రం ’29’ థియేటర్లలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. ఇలాంటి ఫీల్ గుడ్ మూవీని ఒకవేళ మీరు థియేటర్లలో చూడలేకపోయినా, చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విడుదలై నెల కూడా కాకుండానే చిత్ర నిర్మాతలు ఈ సినిమాను ఇంట్లోనే చూసేందుకు ప్రేక్షకులకు అవకాశాన్ని కల్పించారు. తాజాగా ’29’ ఓటీటీ విడుదల తేదీని నిర్మాతలు వెల్లడించారు. ’29’ మూవీ ఎప్పుడు, ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

29 ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది ?

మే 8న థియేటర్లలో విడుదలై మంచి స్పందనను అందుకుంది ’29’ చిత్రం. అయితే నెల కూడా గడవకముందే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోకి రాబోతుండడం విశేషం. విధు, ప్రీతి అశ్రాని ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ జంట కెమిస్ట్రీ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం జూన్ 5న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమ్ అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు.

Advertisement

Also Read : బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

మరి ఈ చిత్రాన్ని ఎక్కడ చూడవచ్చని ఆలోచిస్తున్నారా ? ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుందో చూడాలి. రత్న కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్స్ లోకేష్ కనగరాజ్ జీ స్క్వాడ్, కార్తీక్ సుబ్బరాజ్ స్టోన్ బెంచ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు.

Advertisement

Also Read : డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

’29’ కథ ఏంటి ?

29 అనేది ఒక అందమైన, యవ్వనంలోకి అడుగుపెట్టే ప్రేమకథ. హృదయానికి హత్తుకునే ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీలో జీవితంలో ఒక లక్ష్యం, దిశ కోసం అన్వేషించే 29 ఏళ్ల సత్య అనే యువకుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ క్రమంలో అతను విజి అనే అమ్మాయిని కలుస్తాడు. సత్య పాత్రలో విధు, విజి పాత్రలో ప్రీతి జీవించారనే చెప్పాలి. వారిద్దరి కలయిక కథకు ఒక కొత్త మలుపుని తీసుకొస్తుంది. జీవితం పట్ల వారి దృక్పథం మారడం షురూ అయ్యాక కథలో ట్విస్ట్ ఉంటుంది. ఈ చిత్రంలో విధు, ప్రీతిలతో పాటు ఫాతిమా, అవినాష్, ప్రేమ్, మహేంద్రన్ కూడా నటించారు. ఈ కథ రొమాంటిక్‌గా, భావోద్వేగభరితంగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారా ? అయితే మరో నాలుగు రోజులు వెయిట్ చేయాల్సిందే. కానీ ఓటీటీలో ఈ మూవీని డోంట్ మిస్.

Tags

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×