E-Paper
Advertisement

2026 హారర్ హిట్ ‘ది మమ్మీ’ ఓటీటీలోకి… ఈ 2 రీజన్స్ తెలుసుకున్నాక మూవీ జోలికే వెళ్లరు

2026 హారర్ హిట్ ‘ది మమ్మీ’ ఓటీటీలోకి… ఈ 2 రీజన్స్ తెలుసుకున్నాక మూవీ జోలికే వెళ్లరు
Advertisement

The Mummy on OTT : హాలీవుడ్ హారర్ చిత్రాల ప్రేమికులకు బ్యాడ్ న్యూస్. లీ క్రోనిన్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ అవైటెడ్ హారర్ థ్రిల్లర్ ‘ది మమ్మీ’ (The Mummy – 2026) ఇండియాలో డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టింది. ఇది గుడ్ న్యూసే. కానీ ఈ రెండు రీజన్స్ వింటే అస్సలు ఆ సినిమా జోలికే వెళ్లరు. మరి ఇంతకీ సినిమా కంటే ఎక్కువగా భయపెట్టే ఆ రీజన్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

రెంటు బేసిస్ లో

కొన్ని రోజుల క్రితమే అంతర్జాతీయంగా ‘ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్’ (PVOD) పద్ధతిలో రిలీజ్ అయ్యింది ఈ మూవీ. ఇక ఇప్పుడు ఎట్టకేలకు భారతీయ ఓటీటీ వీక్షకులను పలకరించడానికి సిద్ధమైంది. అయితే ఈ డిజిటల్ రిలీజ్ వెనుక కొన్ని ఆసక్తికరమైన అంశాలతో పాటు, సినీ లవర్స్‌కు షాక్ ఇచ్చే ముచ్చట్లు కూడా ఉన్నాయి. ఈ భయంకరమైన హారర్ థ్రిల్లర్ ను ఏకంగా రెండు ఓటీటీలలో చూసే ఛాన్స్ ఉంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), బుక్‌మైషోకి చెందిన బీఎంఎస్ స్ట్రీమ్ (BMS Stream) లలో ఈ సినిమా డిజిటల్ గా రిలీజ్ అయ్యింది. అయితే ఇక్కడే ఓ పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ సినిమాను రెండు ఓటీటీలలోనూ ఉచితంగా చూసే ఛాన్స్ లేదు. ప్రైమ్ వీడియోలో ఈ చిత్రాన్ని వీక్షించాలంటే రూ. 499 రెంట్, బుక్‌మైషో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో రూ. 549 గా ఉంది. ఒక సినిమాను ఓటీటీలో ఇంత రేటు పెట్టి చూడడం అన్నది చాలా ఎక్కువని చెప్పాలి. సాధారణంగా థియేటర్ టికెట్ ధర కంటే ఇది చాలా ఎక్కువగా ఉండటం సామాన్య ప్రేక్షకులకు పెద్ద భారమే. అందుకే ఈ మూవీని ఓటీటీలో కంటే థియేటర్లలో చూడడమే బెటర్.

Advertisement

Also Read : చరిత్రలోనే అత్యధిక పాపులారిటీ సాధించిన మహిళా సింగర్‌… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ డాక్యుమెంటరీ

ప్రాంతీయ భాషల కొరత

రెంట్ బేసిస్ లో ఈ మూవీని చూడడమే బిగ్ మైనస్ అనుకుంటే, డబ్బింగ్ లో అందుబాటులో లేకపోవడం కూడా మరో కొరత. ఈ సినిమా ప్రస్తుతం తెలుగు, ఇతర ప్రాంతీయ భాషల ఆడియో ట్రాక్‌ లు అందుబాటులో లేకపోవడం నిరాశను కలిగించే విషయం. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైనప్పుడు తెలుగు, తమిళం, హిందీ వంటి భాషల్లో అద్భుతమైన డబ్బింగ్ వెర్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మాత్రం ఆ ఆడియో ట్రాక్‌లను ఇంకా అప్‌లోడ్ చేయలేదు సదరు ఓటీటీ ప్లాట్ ఫామ్స్. కేవలం ఒరిజినల్ ఇంగ్లీష్ వెర్షన్ మాత్రమే ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. కాబట్టి ఈ సినిమాను సొంత ప్రాంతీయ భాషల్లో చూసి ఆస్వాదించాలనుకునే ఆడియన్స్ కు ఇది పక్కా డిసప్పాయింట్ చేసే విషయమే. ఈ చిత్రంలో లాయా కోస్టా, జాక్ రేనార్, వెరోనికా ఫాల్కన్, ‘మూన్ నైట్’ ఫేమ్ మే కలమావి లాంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు.

Related News

వీళ్ళకు చావులేదు… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ సీక్వెల్

సముద్రం ఎడారిగా మారితే ? మనిషి మాంసం కోసం అగాధపు జీవుల అరాచకం… థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్

ZEE5లో సెప్టెంబర్ సినిమాల జాతర… మైండ్ బ్లాక్ చేసే మల్టీ-లాంగ్వేజ్ మూవీస్ సిరీస్ల లిస్ట్

1300 కోట్ల థ్రిల్లర్ తెలుగులో… కేక పుట్టిస్తున్న మైండ్ బ్లాక్ క్రైమ్ కామెడీ

2600 కోట్ల కలెక్షన్లు… 7.9 IMDb రేటింగ్… తెలుగులో అందుబాటులో ఉన్న ఆల్ టైమ్ క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో పండగే పండగ… తెలుగులో ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు

ఫ్రెండ్స్‌తో చూస్తే పొట్టచేక్కలవ్వాల్సిందే… పిచ్చి పిచ్చి గొడవలతో నవ్వించే కామెడీ డ్రామా

ఎఫైర్ ను అడ్డం పెట్టుకుని ఇదేం పాడుపని ? ప్రతీ నిమిషం నెయిల్ బైటింగ్ సస్పెన్స్

Big Stories

Advertisement
×