IPL 2026 Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) ఫైనల్స్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bengaluru) నిల్వగా… గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) దారుణంగా ఓడిపోయి రన్నరప్ గా నిలవడం జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చిత్తుగా ఓడిపోయిన క్రమంలో… ఆ జట్టు బౌలింగ్ కోచ్ ఆశిష్ నెహ్రా పైన ( Ashish Nehra) దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఒకవైపు గుజరాత్ టైటాన్స్ ఓటమి అంచున ఉంటే.. మరోవైపు హాయిగా గోర్లు (Ashish Nehra Cutting Nails) తీసుకుంటూ కోచ్ ఆశిష్ నెహ్రా కనిపించారు. ప్రతి మ్యాచ్ లో బౌండరీ గేట్ దగ్గర చాలా యాక్టివ్ గా ఉంటూ, గుజరాత్ జట్టుకు ఎన్నో విజయాలు అందించారు. కానీ ఈ కీలక ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మాత్రం… కాళ్ళ గోర్లు తీసుకుంటూ సేద తీరారు. దీంతో ఆశిష్ నెహ్రాను ఉద్దేశించి గుజరాత్ టైటాన్స్ అభిమానులు దారుణంగా సెటైర్లు పేల్చుతున్నారు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో కోచ్ ఆశిష్ నెహ్రా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బౌలర్లకు సలహాలు సూచనలు ఇవ్వకుండా, మ్యాచ్ మొత్తం గబ్బు లేపారు. బౌండరీ గేట్ దగ్గర గుజరాత్ బౌలర్లకు సలహాలు, సూచనలు ఇవ్వకుండా నెయిల్ కట్టర్ తో… గోర్లు తీసుకుంటూ కనిపించారు ఆశిష్ నెహ్రా. అదే సమయంలో చేసేదేమీ లేక ఫీల్డింగ్ చేస్తున్న గిల్… చేతి గోర్లను కోరుకుంటు కనిపించాడు. దీంతో ఇద్దరి పైన దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు జనాలు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరోసారి ఛాంపియన్ అయింది. ఆదివారం జరిగిన ఫైనల్స్ మ్యాచ్ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ పై ఏకంగా ఐదు వికెట్ల తేడాతో విక్టరీ నమోదు చేసుకుంది. గుజరాత్ విధించిన 156 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలో ఫినిష్ చేసింది బెంగుళూరు. చివరలో సిక్సర్ కొట్టి మ్యాచ్ గెలిపించాడు కోహ్లీ. దీంతో రెండోసారి ఛాంపియన్ అయింది బెంగళూరు. ఇక ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ ఓడిపోయింది. అక్కడే సగం మ్యాచ్ పోయిందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఆ తర్వాత ఓపెనర్లు గిల్ అలాగే సాయి సుదర్శన్ ఇద్దరు కనీసం 70 నుంచి 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాలి. కానీ మనోళ్లు 20 లోపే ఔట్ అయ్యారు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ సరిగ్గా ఆడలేదు. ఇక స్కోర్ తక్కువగా ఉన్న నేపథ్యంలో అవలీలగా బెంగళూరు గెలిచింది. స్కోర్ ఎక్కువగా ఉంటే గుజరాత్ టైటాన్స్ బౌలర్లు కట్టుడి చేసేవాళ్లు.