E-Paper
Advertisement

హాలీవుడ్ స్టైల్ తమిళ మర్డర్ మిస్టరీ… మైండ్ బ్లాంకయ్యే క్లైమాక్స్

హాలీవుడ్ స్టైల్ తమిళ మర్డర్ మిస్టరీ… మైండ్ బ్లాంకయ్యే క్లైమాక్స్
Advertisement

Tamil Courtroom Thriller : 2025లో విడుదలైన తమిళ కోర్ట్‌రూమ్ డ్రామా ‘ది వెర్డిక్ట్’ (The Verdict). సినిమా మొదలైనప్పటి నుంచే ప్రేక్షకులను ఉత్కంఠలో ముంచెత్తే మూవీ ఇది. కృష్ణ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచి సస్పెన్స్, ట్విస్టులతో పాటు ఎమోషన్ కూడా బాగుంటుంది. సుహాసిని మణిరత్నం, వరలక్ష్మి శరత్ కుమార్, శృతి హరిహరన్ ప్రధాన పాత్రల్లో నటించారు. నిజానికి తమిళ సినిమాలు చాలా వరకు రాగా ఉంటాయి. కానీ ఈ సినిమా మాత్రం హాలీవుడ్ స్టైల్ లో ఉంటుంది.

కథలోకి వెళ్తే ?

కథ ధనవంతురాలైన ఎలిజా మరణంతో మొదలవుతుంది. వీల్‌ చైర్‌లో కూర్చుని జీవితం గడుపుతున్న ఈ సంపన్నురాలు అనుమానాస్పదంగా కన్ను మూస్తుంది. పోలీసులు దర్యాప్తు చేస్తూ ఆమె దగ్గరి సహాయకురాలు నమృతపై అనుమానాలు వ్యక్తం చేస్తారు. నమృత ఎలిజా వీలునామాలో ప్రధాన లబ్దిదారురాలు కావడం, వారి మధ్య ఉన్న కొన్ని విభేదాలు ఉండడంతో హత్య ఆరోపణలు వస్తాయి. దీంతో నమృతను అరెస్టు చేసి కేసు కోర్టుకు తీసుకెళ్తారు. ఈ కేసును చేపట్టిన న్యాయవాదిని మాయ చాలా నిబద్ధతతో పోరాడుతుంది.

Advertisement

Also Read : నిర్జన ద్వీపంలో చిక్కుకుపోయే 8 మంది అమ్మాయిలు… కట్ చేస్తే ఒళ్లు గగుర్పొడిచే ట్విస్ట్

నమృత నిర్దోషి అని నిరూపించడానికి చాలా ట్రై చేస్తుంది. కోర్టు విచారణ సమయంలో ఒక్కొక్క లేయర్ బయట పడుతుంది. ఎలిజా జీవితంలోని రహస్యాలు, ఆమె భాగస్వామి, బట్లర్, కుటుంబం… అందరి మధ్య ఉన్న సంబంధాలు, లాభాలు, మోసాలు షాక్ కు గురి చేస్తాయి. కథ ముందుకు సాగుతున్న కొద్దీ ట్విస్టులు వస్తాయి. నమృత నిజంగా నిర్దోషినా? ఎలిజా మరణం వెనుక ఉన్న నిజమైన కారణం ఏమిటి ? అన్నది చివరి వరకు ఉత్కంఠను కొనసాగిస్తుంది.

ఎక్కడ చూడాలి ?

Advertisement

‘ది వెర్డిక్ట్’ కేవలం కోర్ట్‌రూమ్ డ్రామా మాత్రమే కాదు… న్యాయం, మోసం, కర్మ, కుటుంబ సంబంధాలు, లాభాల కోసం మనుషులు ఎంత దాకా వెళ్తారో లోతుగా చూపించే సినిమా. ట్విస్టులు బాగా ఉంటాయి. ముఖ్యంగా శృతి హరిహరన్, వరలక్ష్మి శరత్ కుమార్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సినిమా పేస్ కూడా బాగుంది. కోర్టు సన్నివేశాలు ఉత్కంఠభరితంగా ఉంటాయి. కర్మ ఎలా పని చేస్తుందో చివరి సన్నివేశాల్లో అందంగా చూపించారు. ఇక సినిమాలో నమృతగా శృతి హరహరన్, వరలక్ష్మి శరత్ కుమార్ – మాయ అనే న్యాయవాది పాత్రలో, సుహాసిని మణిరత్నం – ఎలిజా అనే రిచ్ మహిళగా నటించారు. ప్రకాష్ మోహన్‌దాస్, విద్యులేఖ రామన్ మొదలైనవారు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా థియేటర్లలో 2025 మే 30న విడుదలైంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prme Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ సినిమా మూవీ లవర్స్ ఇప్పటిదాకా ఈ సినిమాను చూడకపోతే వెంటనే ఓ లుక్కేయండి.

Also Read : 1984లో ఎగిరి 2019లో కూలే విమానం… ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ను ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు

Related News

Weekend OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీ వినోదం.. డోంట్ మిస్ ఇట్..

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

వీరభద్రుని రహస్యం’ క్లైమాక్స్ ప్రశ్నలకు సమాధానం… ఒళ్ళు గగుర్పొడిచే మలుపులతో వస్తున్న మైండ్ బెండింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×