E-Paper
Advertisement

టామ్ క్రూజ్ మూవీని డిలీట్ చేయనున్న ఓటీటీ… ఇదే చివరి రోజు

టామ్ క్రూజ్ మూవీని డిలీట్ చేయనున్న ఓటీటీ… ఇదే చివరి రోజు
Advertisement

Action Thriller OTT : 1986లో విడుదలై ప్రపంచ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన ఓ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మరికొన్ని గంటల్లో ఓటీటీ నుంచి నిష్క్రమించబోతోంది. మరి ఆ మూవీ పేరేంటి ? ఏ ఓటీటీలో ఉంది ? ఎప్పుడు, ఎందుకు డిలీట్ కాబోతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

మరికొన్ని గంటల్లో డిలీట్

బ్లాక్ బస్టర్ యాక్షన్ మూవీ ‘టాప్ గన్’ (Top Gun) విడుదలై ఈ ఏడాదితో 40 ఏళ్లు గడిచిపోయాయి. టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ డ్రామా థియేటర్లలో రీరిలీజ్ అయ్యి అభిమానులను ఆకట్టుకుంది. దీని సీక్వెల్ ‘టాప్ గన్ : మావెరిక్’తో కలిపి డబుల్ ఫీచర్‌ గా ప్రదర్శించడంతో ఈ ఈవెంట్‌ మరింత స్పెషల్ అయ్యింది. కానీ ఇప్పుడు ఓటీటీ ప్రేమికులకు, ఈ మూవీ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. 2026 జూన్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్ నుంచి ఈ క్లాసిక్ సినిమా డిలీట్ అవుతుంది. కాబట్టి ఈ మూవీని థియేటర్లలో కాకుండా ఓటీటీలో చూడాలనుకుంటే వెంటనే త్వరపడండి.

కథలోకి వెళ్తే…

Advertisement

అమెరికన్ నేవీ ‘టాప్ గన్’ ఫైటర్ వెపన్స్ స్కూల్ చుట్టూ తిరుగుతుంది కథ. టామ్ క్రూజ్ పీట్ మావెరిక్ మిచెల్ పాత్రలో అద్భుతంగా నటించి అదరగొట్టాడు. మావెరిక్ బ్రేవ్ అబ్బాయి. అలాగే రూల్స్ ఫాలో అవ్వని యంగ్ పైలట్. అతని బెస్ట్ ఫ్రెండ్ గూస్ తో కలిసి టాప్ గన్ స్కూల్‌ లో ట్రైనింగ్ తీసుకుంటారు. అక్కడ చార్లీ (కెల్లీ మెగిన్) అనే ఇన్‌స్ట్రక్టర్ తో ప్రేమలో పడతాడు. కథలో యాక్షన్, రొమాన్స్, ఫ్రెండ్‌షిప్, లాస్… అన్నీ బ్యాలెన్స్‌ గా ఉంటాయి. మావెరిక్ తన ఫాదర్ మరణం గురించి ఉన్న రహస్యాలు, స్కూల్‌ లో జరిగే పోటీలు, ఎయిర్ డాగ్ ఫైట్స్ వంటి సీన్స్ వంటివన్నీ చాలా ఉత్కంఠభరితంగా ఉంటాయి.

Also Read : ‘సేవ్ ది టైగర్స్’ థర్డ్ ఇన్స్టాల్మెంట్… ట్రైలర్ లో ఈ విషయం గమనించారా భయ్యా

టెక్నికల్ హైలైట్స్ – అవార్డులు

Advertisement

టోనీ స్కాట్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు డాన్ సింప్సన్-జెర్రీ బ్రూక్‌హైమర్ సినిమాను నిర్మించిన తీరు ఈ చిత్రానికి బలం చేకూరుతుంది. యాక్షన్ సీన్స్‌ లో ఉపయోగించిన రియల్ ఫైటర్ జెట్లు, అప్పటి సాంకేతికతతో సృష్టించిన విజువల్స్ ఇప్పటికీ చూడడానికి అద్భుతంగా ఉంటాయి. కెన్నీ లాగిన్స్ పాటలు, సినిమాకు మరింత ఎనర్జీ ఇస్తాయి. ఇక ఈ చిత్రం ఏకంగా 6 ఆస్కార్ నామినేషన్లు అందుకోవడం విశేషం. ఉత్తమ సౌండ్, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీల్లో అవార్డులు కూడా గెలుచుకుంది. టామ్ క్రూజ్ ఇమేజ్‌ను సూపర్ స్టార్‌ గా మార్చిన సినిమా ఇది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన 80ల సినిమాల్లో ఈ మూవీ ఒక ఐకాన్‌ లాంటిది. ఓటీటీలో చూడాలంటే ఇదే చివరి అవకాశం.

ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది. తెలుగు సబ్‌టైటిల్స్‌తో కూడా ఓటీటీలో చూడవచ్చు. జూన్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్ నుంచి డిలీట్ కానుంది. యాక్షన్, రొమాన్స్, ఫ్రెండ్‌షిప్ కలిపి ఒక పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది ఈ మూవీ. 80ల నాటి ఈ సినిమా మ్యాజిక్ ను ఒక్కసారి చూస్తే ఇప్పటికీ ఎప్పటికీ చూసిన వాళ్లు మరచిపోలేరు.

Tags

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×