Action Thriller Films on OTT : సినిమా హాల్‌లో లైట్లు ఆఫ్ అయ్యాక, బిగ్ స్క్రీన్ మీద బూమ్ బూమ్ సౌండ్ వచ్చి బాడీలో అడ్రినలిన్ పెరిగితే.. ఆ ఫీల్ వేరే సార్! ఇలాంటి హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు థియేటర్‌లో చూస్తే ఒళ్ళంతా పూర్తిగా షేక్ అవుతుంది. ఇప్పుడు ఇంట్లో కూర్చుని ఆ కిక్కును ఫీల్ అవ్వాలనుకుంటే… ఈ 5 సూపర్ ఎపిక్ హాలీవుడ్ యాక్షన్ మూవీలు మీకు పర్ఫెక్ట్.
యాక్షన్ సినిమాలకు కొత్త డెఫినిషన్ ఇచ్చిన సినిమా ఇది. జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో ఆర్నాల్డ్ ష్వార్జెనెగ్గర్ రోబోగా వచ్చి చేసిన యాక్షన్ సీన్లు, లిక్విడ్ మెటల్ విలన్ తో జరిగిన ఫైట్లు, ఇప్పటికీ అత్యుత్తమ యాక్షన్ మూవీల్లో ఒకటిగా నిలిచిపోయింది.ఈ మూవీ Lionsgate Play, Jio Hotstarలో అందుబాటులో ఉంది.
దట్టమైన అడవిలో కంటికి కనిపించని గ్రహాంతర వేటగాడు.. ఆర్నాల్డ్ నేతృత్వంలోని ఆర్మీ టీమ్‌తో జరిగే భయంకర హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఈ సినిమా ఇచ్చే థ్రిల్, టెన్షన్ చూస్తే గుండె మరింత వేగంగా కొట్టుకుంటుంది. క్లైమాక్స్ వరకు కళ్లు తిప్పుకోనివ్వదు ఈ మూవీ. ఇది జియో హాట్ స్టార్ లో ఉంది.
ఈ సినిమా మొదలైన మొదటి నిమిషం నుంచి ఎండ్ టైటిల్స్ వరకు నాన్-స్టాప్ యాక్షన్. కారు ఛేజింగ్ లు, బ్లాస్టింగ్ లు, స్టంట్స్.. రియల్ స్టంట్స్‌తో థియేటర్ ను దుమ్ములేపేసింది. ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది ఈ మూవీ. జియో హాట్ స్టార్ తో Apple TVలో అందుబాటులో ఉంటుంది.
Also Read : డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే
టామ్ క్రూజ్ అంటే ప్రాణాలు పణంగా పెట్టి స్టంట్స్ చేసే హీరో అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హెలికాప్టర్ ఫైట్, బిల్డింగ్ పై నుంచి దూకడం, బైక్ ఛేజ్… ఈ సినిమాలోని యాక్షన్ సీన్లు చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. Netflix, Amazon Prime Videoలో ఉంది.
30 ఏళ్ల తర్వాత వచ్చిన సీక్వెల్ అయినా థియేటర్లను షేక్ చేసింది. రియల్ ఫైటర్ జెట్లలో షూట్ చేసిన స్కై యాక్షన్ సీన్లు, థియేటర్‌లో కూర్చుని ఆకాశంలో విహరించినట్టు అనిపిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఈ సినిమాలు ఏదైనా ఒక్కటి చూస్తే చాలు… ఇంట్లోనే ఫుల్ యాక్షన్ మూడ్‌లోకి వెళ్తారు.
Also Read : 2026 హారర్ హిట్ ‘ది మమ్మీ’ ఓటీటీలోకి… ఈ 2 రీజన్స్ తెలుసుకున్నాక మూవీ జోలికే వెళ్లరు