BigTV English
Advertisement

Vash level 2: థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా సంచలనం.. మొదటి చిత్రంగా!

Vash level 2: థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా సంచలనం.. మొదటి చిత్రంగా!

Vash level 2:ఒకప్పుడు బాగా ఫేమస్ వున్న హీరోలు, హీరోయిన్లు నటించిన చిత్రాలకు ఎక్కువ విలువను ఇచ్చేవారు. ముఖ్యంగా కాస్టింగ్ చూసి సినిమా థియేటర్లకు వెళ్లిన ఆడియన్స్ కూడా లేకపోలేదు. కానీ కాలం మారుతోంది. స్టార్ కాస్టింగ్ కంటే కూడా మంచి కథకు సినీ ప్రేక్షకులు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగానే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు మంచి కంటెంట్ ఉంటే చాలు స్టార్ కాస్ట్ లేకపోయినా ఆ సినిమా హిట్టవుతుందని ఎన్నో చిత్రాలు ఇప్పటికే నిరూపించాయి కూడా. అయితే ఇప్పుడు ఒక గుజరాతీ ఫిలిం ఏకంగా భారీ పాపులారిటీ సొంతం చేసుకొని ఏ గుజరాతీ ఫిలింకి దక్కని అద్భుతమైన ఆదరణ దక్కించుకొని రికార్డు క్రియేట్ చేసింది.


ఏకైక గుజరాతీ ఫిలింగా రికార్డ్..

అదేదో కాదు వాష్ లెవెల్ 2. ఆగస్టులో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇటీవలే నెట్ ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.. ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు భారీ ట్రెండ్ గా నిలుస్తోంది అని చెప్పవచ్చు. దీనికి కారణం ఈ సినిమా ఓటీటీ రైట్స్ అనడంలో సందేహం లేదు. ఈ సినిమా ఓటీటీ హక్కులను రూ.3.5 కోట్లు చెల్లించి మరీ నెట్ఫ్లిక్స్ దక్కించుకుందని సమాచారం. ఇకపోతే ఇప్పటివరకు ఇలాంటి డీల్ ఏ గుజరాతీ ఫిలిం కి కూడా జరగకపోవడం ఇదొక సెన్సేషన్ అని చెప్పాలి. థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అలా ఎక్కువ ధరకు అమ్ముడుపోయి అత్యధిక ధరకు అమ్ముడుపోయిన మొదటి గుజరాతీ చిత్రంగా నిలిచింది.

18 కోట్ల వరకు ప్రాఫిట్..

ఇకపోతే ఆగస్టు 27వ తేదీన గుజరాతీతో పాటు హిందీలో కూడా డబ్ చేసి థియేటర్లలో విడుదల చేశారు. సుమారుగా 8 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఇప్పటివరకు సుమారుగా రూ.18 కోట్ల వరకు రాబట్టింది. అక్టోబర్ 22 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకి ఆడియన్స్ కనెక్ట్ కావడానికి కారణం ఇదొక సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ స్టోరీ కావడమే విశేషం అని చెప్పాలి. 2023 లో వచ్చిన వశ్ మూవీకి ఇది సీక్వెల్. ఈ సినిమాను హిందీలో సైతాన్ పేరుతో అజయ్ దేవగన్ (Ajay Devgan) రీమేక్ చేసి హిట్టు కొట్టారు. అయితే ఈసారి హిందీలో రీమేక్ చేయడానికి వీలు లేకుండా నేరుగా హిందీలో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఇక అలా ఈ సినిమా ఇటు థియేటర్లలో భారీ విజయాన్ని సొంతం చేసుకొని.. అటు ఓటీటీలలో కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది.


ALSO READ:Swara Bhaskar: పదేళ్ల వయసులోనే ఆ స్టార్ హీరో పై మనసు పడ్డా.. కోరిక తీరలేదంటూ!

వశీకరణ విద్యతో..

బ్లాక్ మ్యాజిక్ (వశీకరణ విద్య) తో సాగే ఈ హారర్ కాన్సెప్ట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా ట్రైలర్ లోనే విద్యార్థులు అనుకోకుండా వశీకరణ విద్యకు లోను కావడం.. బిల్డింగ్ పైనుంచి ఏడుస్తూ ఒకేసారి ఎనిమిది నుంచి పదిమంది విద్యార్థినిలు దూకి చనిపోవడం, ఇక రోడ్ల మీదకు వచ్చి విచక్షణారహితంగా ప్రజలపై దాడి చేయడం.. లాంటి సన్నివేశాలు ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా మంచి రేటింగ్ కూడా అందుకుంటుంది.

Related News

OTT Movie : పాడుబడ్డ హవేలీలో దడ పుట్టించే సీన్లు… దెయ్యాలను పట్టుకోవడానికి వెళ్ళి దిక్కుమాలిన చావు

OTT Movie : ఏం సినిమా మావా… ఒక్కొక్క సీన్ కు రోమాలు నిక్కబొడుచుకోవడం పక్కా… హార్ట్ వీక్‌గా ఉన్నవాళ్ళు అస్సలు చూడొద్దు

OTT Movie : టీనేజ్ పాప మిస్సింగ్ తో టీచర్‌కు లింక్… నరాలు కట్టయ్యే ఉత్కంఠ

OTT Movie : దెయ్యాలకు ప్యాంట్ తడిపించే అన్నదమ్ములు… ఐఎండీబీలో 8.4 రేటింగ్… ఒక్కో సీన్ దబిడి దిబిడే

OTT Movie : చచ్చినా గేమ్‌ను వదలని దెయ్యం… వాలీబాల్ కెప్టెన్ కిరాతకం… అమ్మాయి మర్డర్ తో ఖతర్నాక్ షాక్

OTT Movie : ఐలాండ్‌లో అరాచకం… ఒకే అమ్మాయితో ఇద్దరబ్బాయిలు… ఫ్యామిలీతో చూడకూడని మూవీ మావా

OTT Movie : అన్నతో పెళ్ళి తమ్ముడితో యవ్వారం… ఈ క్రేజీ కొరియన్ సిరీస్ కెవ్వు కేక

Big Stories

×