OTT Movie : రియల్ స్టోరీల ఆధారంగా ఎన్నో సినిమాలు తెరకెక్కుతున్నాయి. వీటిలో కొన్ని సినిమాలు ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు జరుగుతుంది. ఈక్వెడార్‌లోని గాలా పాగోస్ దీవులలో ప్రశాంతంగా జీవితం మొదలు పెట్టాలని ఒక జంట వస్తుంది. అయితే అనుకున్నది ఒక్కటైతే, అనుకోని సన్నివేశాలు ఎక్కువగా జరుగుతాయి. ఆ దీవికి మరి కొంత మంది రావడంతో అసలు కథ మొదలవుతుంది. రొమాన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఈ సినిమా హీట్ పుట్టిస్తుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
‘ఎడెన్’ (Eden) అనేది 2024లో విడుదలైన అమెరికన్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా. ఇది రాన్ హౌవర్డ్ (అపోలో 13, ది డావిన్చీ కోడ్ ఫేమ్) దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో ఇందులో జూడ్ లా, అనా డి అర్మాస్, వెనెస్సా కిర్బీ, సిడ్నీ స్వీనీ, డేనియల్ బ్రూల్, ఫెలిక్స్ కమ్మరర్, టోబి వాలెస్ నటించారు. ఈ సినిమా 2025 ఆగష్టు 22న విడుదలైంది. అక్టోబర్ 24 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
జర్మనీలో డాక్టర్ ఫ్రిడ్రిక్ అతని ప్రేమికురాలు డోర్, మోడరన్ లైఫ్ వదిలేసి ఒక ఐలాండ్‌కు వస్తారు. వాళ్లు ఎవరూ లేని ద్వీపంలో ప్రకృతితో కలిసి జీవించాలని కలలు కంటారు. ఫ్రిడ్రిక్ తన భార్యను వదిలేసి డోర్‌తో కలసి జీవించాలని వచ్చాడు. వాళ్లు ద్వీపంలో ఇల్లు కూడా కట్టుకుంటారు. అంతే కాకుండా గార్డెన్ పెంచుతారు. పండ్లు, చేపలు తింటూ మొదట్లో హాయిగానే బతుకుతారు. కానీ ద్వీపంలో వైల్డ్ యానిమల్స్, బురదతో భయంకరంగా ఉంటుంది. దీనికి తోడు ఫ్రిడ్రిక్, డోర్‌ను బానిసలా ట్రీట్ చేస్తాడు. దీంతో ఆమె చాలా బాధపడుతుంది. కొన్ని నెలల తర్వాత ఒక కంపెనీ ఫౌండర్ హైన్జ్ విట్మర్, ఫ్రిడ్రిక్ గురించి వార్తా పత్రికలో తెలుసుకుంటాడు. అతను తన ప్రెగ్నెంట్ భార్య మార్గ్రెట్ తో కలసి ద్వీపానికి వస్తాడు. వాళ్లు కూడా ఇలాంటి జేవితం గడపాలని కలలు కంటారు.
Read Also : పెళ్ళాం గదిలోకి దగ్గరుండి మరో మగాడిని పంపే భర్త… సింగిల్ గా చూడాల్సిన అరాచకం మావా