OTT Movie : హారర్ సినిమాలు రకరకాల కథలతో ఆడియన్స్ ని భయపెట్టడానికి వస్తుంటాయి. అందులోనూ హాలీవుడ్ హారర్ సినిమాలు చాలా వరకు చర్చి చుట్టూ తిరుగుతుంటాయి. ఎక్సార్సిజమ్, దెయ్యాలతో ఈ సినిమాలు గూస్ బంప్స్ తెప్పిస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా చర్చి అబ్యూస్, మహిళలపై దారుణాలను హైలెట్ చేస్తుంది. దెయ్యాల కంటే మనుషులే డేంజర్ అనే మెసేజ్ ఇస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
“ది డెవిల్స్ డోర్‌వే” (The Devil’s Doorway) 2018లో విడుదలైన ఐరిష్ ఫౌండ్ ఫుటేజ్ హారర్ సినిమా. ఐస్లిన్ క్లార్క్ డైరెక్షన్‌లో లాలర్ రాడీ, సియారన్ ఫ్లిన్, లోరెన్ కో ప్రధాన పాత్రల్లో నటించారు. 76 నిమిషాల ఈ థ్రిల్లర్ సినిమా, ఐయండిబిలో 5.3/10, రాటెన్ టొమాటోస్ లో 80% రేటింగ్ పొందింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
1960నాటి కాలంలో ఐర్లాండ్‌లో ఒక ఆశ్రమంని మ్యాగ్డలీన్ లాండ్రీ నడుపుతుంటుంది. ఇక్కడ పాపం చేసిన అమ్మాయిల్ని బానిసల్లా పని చేపిస్తుంటారు. పిల్లలు పుట్టితే వాళ్ళకి దూరం చేస్తారు. ఒక రోజు వాటికన్ నుంచి థామస్, జాన్ అనే ఇద్దరు ఫాదర్స్ చూడడానికి వస్తారు. అయితే అక్కడ 16 ఏళ్ల కాథ్లీన్ గర్భవతిగా ఉంటుంది. ఆశ్రమం హెడ్ మదర్ సుపీరియర్ వాళ్లను స్వాగతిస్తుంది. కానీ కాథ్లీన్‌ను చూడనివ్వదు. చివరికి వాళ్ళు ఆమె ఉన్న రూమ్‌కు వెళ్తే పరిస్థితి ఘోరంగా ఉంటుంది. కాథ్లీన్ చైన్స్‌తో కట్టేసి ఉంటారు. శరీరం గాయాలతో, గోడలపై రక్తం మరకలతో నిండి ఉంటుంది. అక్కడి వాళ్ళు అందరూ ఆమె వర్జిన్ అని చెప్తారు. కానీ గర్భం ఎలా వచ్చిందో తెలీదని అంటారు. ఒక డాక్టర్ కూడా నిజంగా ఆమె వర్జిన్ అని క్లారిటీ ఇస్తాడు.
Read Also : మాజీ ప్రియుడి బ్లాక్ మెయిల్… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్, టర్న్ ఉన్న సినిమా… నరాలు కట్టయ్యే సస్పెన్స్
వీళ్ళు వచ్చిన మొదటి రాత్రి నుంచే అక్కడ భయం స్టార్ట్ అవుతుంది. కాథ్లీన్ వాల్స్‌పై స్పైడర్ లాగా నడుస్తుంది, డీప్ వాయిస్‌లో మాట్లాడుతుంది. ఆశ్రమంలోని అమ్మాయిలు ఒక షాకింగ్ సీక్రెట్ చెప్తారు. పాదిరీలు సెక్స్ అబ్యూస్ చేయడం వల్లే పిల్లలు పుడుతున్నారని వివరిస్తారు. అయితే మదర్ సుపీరియర్ దీనిని కవరప్ చేస్తుంది. అక్కడికి వచ్చిన పాదిరీలు కాథ్లీన్ పై ఎక్సార్సిజమ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ డెమన్ బలంగా ఉంటుంది. ఫాదర్ జాన్‌పై అటాక్ చేస్తుంది. డెమన్ ఈ ఆశ్రమం రాక్షసాల గూడు, డెమన్ కంటే భయంకరం అని అరుస్తుంది. చివరికి ఎక్సార్సిజమ్ ఫెయిల్ అవుతుంది. కాథ్లీన్ చనిపోతుంది. కానీ డెమన్ ఎస్కేప్ అవుతుంది. ఆశ్రమం కూడా అగ్నికి ఆహుతి అవుతుంది. ఈ కథ డెమన్ కంటే మనుషులే భయంకరం అని చూపిస్తుంది.