BigTV English
Advertisement

OTT Movie : దెయ్యాలకు ప్యాంట్ తడిపించే అన్నదమ్ములు… ఐఎండీబీలో 8.4 రేటింగ్… ఒక్కో సీన్ దబిడి దిబిడే

OTT Movie : దెయ్యాలకు ప్యాంట్ తడిపించే అన్నదమ్ములు… ఐఎండీబీలో 8.4 రేటింగ్… ఒక్కో సీన్ దబిడి దిబిడే

OTT Movie : అమెరికాలోని అత్యంత లాంగ్ రన్నింగ్ సూపర్‌ నాచురల్ సిరీస్ ఓటీటీలో నడుస్తోంది. ఇది పదిహేను సీజన్లతో ప్రేక్షకులను అలరించింది. ఐయండిబిలో కూడా 8.4 టాప్ రేటింగ్ ని పొందింది. ఇందులో ఇద్దరు సోదరులు భూతాలు, డెమన్స్, మాంస్టర్స్ వంటి చెడు శక్తులతో పోరాడుతూ అమెరికా అంతటా ప్రయాణిస్తారు. కనిపించకుండా పోయిన తమ తండ్రిని వెతికే ప్రయాణంలో ఈ కథ జరుగుతుంది. ప్రతి ఎపిసోడ్‌లో ఒక మిస్టరీ ఉంటుంది. కామెడీ, హారర్, ఎమోషనల్ మూమెంట్స్ ఈ సిరీస్ నడుస్తుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? ఈ కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ఏ ఓటీటీలో ఉందంటే

‘సూపర్‌ నాచురల్’ (Supernatural) 2005 నుండి 2020 వరకు The WB, The CW నెట్‌వర్క్‌లలో విడుదలైన అమెరికన్ సూపర్‌ నాచురల్ హారర్ టీవీ సిరీస్. ఎరిక్ క్రిప్కే దీనిని రూపొందించారు. ఇది 15 సీజన్‌లు, 327 ఎపిసోడ్‌లతో రన్ అయింది. ఇందులో జారెడ్ పడలెక్కి, జెన్సెన్ ఆక్లెస్ ప్రధాన పాత్రల్లో నటించారు. నెట్‌ఫ్లిక్స్‌లో పూర్తి సిరీస్ అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

సామ్, డీన్ అనే ఇద్దరు సోదరులు ఉంటారు. వాళ్ల తల్లి మేరీని చిన్నప్పుడు ఒక డెమన్ చంపేసి ఉంటుంది. ఆ తరువాత తండ్రి జాన్ వాళ్లను డెమన్ హంటర్స్‌గా పెంచాడు. భూతాలు, మాంస్టర్స్‌ను చంపడం నేర్పిస్తాడు. అయితే సామ్ కాలేజీలో చదువుతూ సాధారణ జీవితం కోరుకుంటాడు. డీన్ హంటర్‌గానే జీవితం మొదలు పెడతాడు. ఒక రోజు తండ్రి ఉన్నట్టుండి కనుమరుగు అవుతాడు. దీంతో డీన్ సామ్‌ను తీసుకెళ్తాడు. ఇద్దరూ కలిసి తండ్రిని వెతకడం మొదలు పెడతారు. వాళ్లు ఒక పాత కారులో అమెరికా అంతా తిరుగుతారు. భూతాలు , వాంపైర్, వెర్‌వుల్ఫ్, డెమన్ లను వాళ్లు ఉప్పు, గన్, రిచ్యువల్స్ తో చంపుతుంటారు. తండ్రిని మాయం చేసిన డెమన్‌ను వెతుకుతారు.


Read Also : బ్రూటల్ మర్డర్స్… అమ్మాయిల బట్టల వాసన చూస్తూ ఆ పాడు పని చేసే సైకో… రోమాలు నిక్కబొడుచుకునే సీన్లు

సీజన్ 2లో తండ్రి కనిపిస్తాడు కానీ చనిపోతాడు. సీజన్ 3-5లో సామ్ డెమన్ బ్లడ్ తాగి పవర్‌ఫుల్ అవుతాడు. డీన్ నరకానికి వెళ్లి తిరిగి వస్తాడు. ఏంజెల్ కాస్టీల్ కి ఫ్రెండ్ అవుతాడు. ప్రపంచ వినాశనాన్ని ఆపడానికి పోరాడతారు. 6-15 సీజన్లలో మరిన్ని ట్విస్ట్‌లు ఉంటాయి. గాడ్ రైటర్ అని తెలుస్తుంది. ఏంజెల్స్, డెమన్స్ యుద్ధం మొదలవుతుంది. సామ్, డీన్ కూడా చాలాసార్లు చనిపోతారు, కానీ తిరిగి బతుకుతారు. చివరి సీజన్‌లో గాడ్‌తో ఫైనల్ ఫైట్ జరుగుతుంది. సామ్, డీన్ గాడ్‌ను ఓడిస్తారు కానీ డీన్ చనిపోతాడు. సామ్ సాధారణ జీవితం గడుపుతాడు. ఈ సుదీర్ఘమైన సిరీస్ ఇలా ముగుస్తుంది.

 

Related News

OTT Movie : ఏం సినిమా మావా… ఒక్కొక్క సీన్ కు రోమాలు నిక్కబొడుచుకోవడం పక్కా… హార్ట్ వీక్‌గా ఉన్నవాళ్ళు అస్సలు చూడొద్దు

OTT Movie : టీనేజ్ పాప మిస్సింగ్ తో టీచర్‌కు లింక్… నరాలు కట్టయ్యే ఉత్కంఠ

OTT Movie : చచ్చినా గేమ్‌ను వదలని దెయ్యం… వాలీబాల్ కెప్టెన్ కిరాతకం… అమ్మాయి మర్డర్ తో ఖతర్నాక్ షాక్

OTT Movie : ఐలాండ్‌లో అరాచకం… ఒకే అమ్మాయితో ఇద్దరబ్బాయిలు… ఫ్యామిలీతో చూడకూడని మూవీ మావా

OTT Movie : అన్నతో పెళ్ళి తమ్ముడితో యవ్వారం… ఈ క్రేజీ కొరియన్ సిరీస్ కెవ్వు కేక

OTT Movie : సైకో కిల్లర్స్‌తో నిండిపోయే హోటల్… గ్రిప్పింగ్ స్టోరీ, సీట్ ఎడ్జ్ థ్రిల్… బ్లడీ బ్లడ్ బాత్

OTT Movie : భర్త బట్టల్లో మరో అమ్మాయి వెంట్రుకలు… ఆ భార్య ఇచ్చే షాక్‌కు ఫ్యూజులు ఔట్

Big Stories

×