E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ 8వ వారం ఎలిమినేట్ అతనే..? ఓటింగ్ రివర్స్.. విన్నర్ ఎవరంటే..?

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ 8వ వారం ఎలిమినేట్ అతనే..? ఓటింగ్ రివర్స్.. విన్నర్ ఎవరంటే..?
Advertisement

Bigg Boss 9 Telugu : తెలుగు బుల్లి తెర పై టాప్ రియాల్టీ షో గా కొనసాగుతున్న బిగ్ బాస్ కు రిమాండ్ రోజుకి పెరుగుతూ వస్తుంది.. ఈమధ్య ఈ షోలో వైల్డ్ కార్డు ఎంట్రీలు వచ్చిన తర్వాత ఆసక్తిగా మారింది అని చెప్పాలి. అంతకుముందు షోలో పెద్దగా గొడవలు జరిగేవి కాదు. వైల్డ్ కార్డు ఎంట్రీస్ తర్వాత ప్రతిరోజు గొడవే. దాంతో జనాలు నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఎవరు గొడవపడతారు అని ఆత్రుతతో షోనీ చూస్తున్నారు.. జనాలను ఇంకాస్త ఆకట్టుకునేలా బిగ్ బాస్ కూడా గొడవలకు ఆజ్యం పోసే టాస్కులను ఇస్తుంటారు.. ఇప్పటికీ 7 వారాలు చేసుకున్న ఈ షో.. ఎనిమిదో వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయి వెళ్ళిపోతారు అన్న ఆసక్తి నెలకొంది.. నిన్నటివరకు ఓటింగ్ ఒకలా ఉంటే ఇవాళ ఓటింగ్ పూర్తిగా మారిపోయింది అనే వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఎక్కువగా ఉన్నాయనేది వివరంగా తెలుసుకుందాం..

ఎనిమిదో వారం ఎలిమినేట్ అయ్యేది అతనే?

ఏడు వారాలు పూర్తి చేసుకున్న ఈ షోలో ఎనిమిదో వారం ఎలిమినేషన్ ఆసక్తిగా మారింది.. ఈవారం బిగ్ బాస్ గేమ్ రూల్స్ పూర్తిగా మార్చేశారు. మాజీ కంటెస్టెంట్లు రీఎంట్రీ ఇచ్చి, ప్రస్తుత హౌస్‌మేట్స్‌ను నామినేట్ చేశారు. ఈ అనూహ్య ట్విస్ట్‌తో హౌస్‌లో షాక్ వాతావరణం నెలకొంది.. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లనే ఎందుకు నామినేట్ చేయలేదు అన్న ప్రశ్నలు జనాల్లో మొదలయ్యాయి.. మొత్తానికి గొడవలతో ఎనిమిదో వారం నామినేషన్స్ పూర్తయింది.. దువ్వాడ మాధురి, రీతు చౌదరి, కళ్యాణ్ పడాల, సంజనా గల్రానీ, తనుజ పుట్టస్వామి, డిమోన్ పవన్, గౌరవ్ గుప్తా, రాము రాథోడ్ లు ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే ఆసక్తి నెలకొంది.

Advertisement

కళ్యాణ్ టాప్ ఓటింగ్ లో కొనసాగుతున్నాడు.. తనుజ సెకండ్ ప్లేస్ లో రాణిస్తుంది.. వీరిద్దరూ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు అస్సలు లేవని చెప్పాలి. ఎటు చూసినా గౌరవ్ డేంజర్ జోన్ లో ఉన్నాడు.. ఆ తర్వాత స్థానంలో దువ్వాడ మాధురి ఉంది.. అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందని టాక్. అదే కనుక నిజమైతే గౌరవ్, మాధురి ఇద్దరు హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సిందే. ఇక్కడ ఓటింగ్ నమోదైన ప్రకారం అయితే ఎప్పుడు ఎలిమినేషన్ జరగలేదన్న విషయం అందరికీ తెలిసిందే. హౌస్ లో గొడవలకి ఆజ్యం పోస్తుంది మాత్రం మాధురి అనే చెప్పాలి.. కచ్చితంగా బిగ్ బాస్ ఈమనైతే బయటికి పంపించడు.. అటు రీతు చౌదరి పవన్ కళ్యాణ్ మధ్య లవ్ ట్రాక్ రోజు రోజుకి ఆసక్తిగా మారుతుంది.. దాంతో ఆమెను కూడా బయటికి పంపించే ఛాన్స్ అస్సలు లేదు. అయితే ఈవారం గౌరవం ఎలిమినేట్ అయ్యి బయటకు రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది…

Also Read:జైలు నుంచి ధీరజ్ రిలీజ్.. పండగ చేసుకున్న సేన, భద్ర.. కోడళ్ల పై రామరాజు ప్రశంసలు..

బిగ్ బాస్ 9 విన్నర్ ఎవరంటే..? 

Advertisement

బిగ్ బాస్ సీజన్ 8 నిఖిల్ విన్నర్ అయిన సంగతి తెలిసిందే.. ముందు సీజన్లో పల్లవి ప్రశాంత్ బిగ్బాస్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు.. ఇక బిగ్ బాస్ 9 లో మాత్రం కళ్యాణ్ స్ట్రాంగ్ కంటెంట్ గా కనిపిస్తున్నాడు. సెలబ్రిటీలతో పోలిస్తే అతని ఆట మాట తీరు జనాలను ఎంతగానో ఆకట్టుకుంటుంది అని చెప్పడంలో సందేహం లేదు.. టాస్కులలో ఆయన చేసిన పర్ఫామెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సీజన్ విన్నర్ గా పవన్ కళ్యాణ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. అటు యూట్యూబ్ ఛానల్ రివ్యూ లు కూడా పవన్ కళ్యాణ్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి.. మరి ఈ సీజన్ కామనర్ కి ట్రోఫీని అందిస్తుందా..? లేదా సెలబ్రిటీ కి అవకాశం దక్కుతుందా అన్నది తెలియాలంటే కచ్చితంగా బిగ్ బాస్ ని ప్రతి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాలి.. ఇవాళ శనివారం కాబట్టి నాగర్జున హౌస్ లోకి రాబోతున్నాడు.. అంతేకాదు మూవీ ప్రమోషన్స్ కోసం గర్ల్ ఫ్రెండ్ టీం కూడా బిగ్ బాస్ లోకి వచ్చే అవకాశం ఉందని టాక్.. మొత్తానికి ఇవాళ ఎపిసోడ్ అయితే రచ్చ రచ్చగానే ఉంటుందని తెలుస్తుంది..

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×