BigTV English
Advertisement

OTT Movie : చచ్చినా గేమ్‌ను వదలని దెయ్యం… వాలీబాల్ కెప్టెన్ కిరాతకం… అమ్మాయి మర్డర్ తో ఖతర్నాక్ షాక్

OTT Movie : చచ్చినా గేమ్‌ను వదలని దెయ్యం… వాలీబాల్ కెప్టెన్ కిరాతకం… అమ్మాయి మర్డర్ తో ఖతర్నాక్ షాక్

OTT Movie : హై స్కూల్ ర్యాగింగ్, సూపర్‌ నాచురల్ థీమ్స్ తో ఒక థాయ్ సినిమా ఆడియన్స్ ని తెగ భయపెడుతోంది. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా మంచి వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఈ స్టోరీ బుస్సబా అనే ఒక హై స్కూల్ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. వాలీబాల్ టీమ్ కెప్టెన్ అయిన ఈ అమ్మాయి ఆత్మగా వచ్చి టీం మీద రివేంజ్ తీర్చుకుంటుంది. ఈ సన్నివేశాలు చాలా భయంకరంగా ఉంటాయి. హారర్ ఫ్యాన్స్ కు ఇది మస్ట్ వాచ్ సినిమా. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘అటాక్ 13’ (Attack 13) అనేది 2025లో విడుదలైన థాయిలాండ్ హారర్ థ్రిల్లర్ సినిమా. డైరెక్టర్ టవీవట్ వంతా (డెత్ విస్పరర్ సిరీస్ ఫేమ్) దీనిని తెరకెక్కించారు. 2025 జూన్ 19న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వగా, అక్టోబర్ 20 నుంచి నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 1 గంట 45 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా, ఐయండిబిలో 5.6/10 రేటింగ్ పొందింది.

స్టోరీలోకి వెళ్తే

బుస్సబా అనే అమ్మాయి ఒక చిన్న టౌన్‌లోని గర్ల్స్ స్కూల్‌లో స్కూల్ లో వాలీబాల్ కెప్టెన్. ఆమె టీమ్ సభ్యులను కొట్టడం, అవమానించడం, ఫిజికల్ పనిష్‌మెంట్ ఇవ్వడం వంటివి చేస్తూ టార్చర్ చేస్తుంటుంది. బుస్సాబా మంచి మార్కులు తెచ్చుకుని, టీమ్‌ను విజయం వైపు నడిపిస్తుంటుంది. కాబట్టి టీచర్లు ఆమెను ఇష్టపడతారు. కానీ టీమ్ మెంబర్లు ఆమెను చూసి భయపడుతుంటారు. ఇక్కడకు కొత్తగా ట్రాన్స్‌ఫర్ అయిన జిన్ అనే డేరింగ్ అమ్మాయి వస్తుంది. ఆమెకూడా వాలీబాల్‌లో ప్రొఫెషనల్ ప్లేయర్. ఆమె బుస్సాబా అన్యాయాన్ని వ్యతిరేకిస్తుంది.


మొదటి రోజు నుంచే జిన్ టీమ్‌లో చేరి, బుస్సాబా ఆర్డర్లను ప్రశ్నిస్తుంది. ఇది బుస్సాబాకు కోపం తెప్పిస్తుంది. జిన్ బలంగా ఆడటం వల్ల టీమ్‌లో టెన్షన్ పెరుగుతుంది. ఇప్పుడు బుస్సాబా జిన్‌ను టార్గెట్ చేస్తుంది. ఆమెను ఐసోలేట్ చేయడం, ఫేక్ రూమర్స్ ప్రచారం చేయడం వంటివి చేస్తుంది. అయితే ఒక రోజు ప్రాక్టీస్ సెషన్ తర్వాత, జిన్ తన స్నేహితులతో వాలీబాల్ కోర్ట్‌లో ఒక ప్రాంక్ చేస్తుంది. దీంతో బుస్సాబా ఉరి వేసుకుని మరణిస్తుంది. ఇది చూసి టీమ్ సభ్యులు షాక్ అవుతారు. పోలీసులు దర్యాప్తు చేస్తారు, కానీ సూసైడ్‌గా కన్సల్యూడ్ అవుతుంది.

Read Also : పీడకలగా మారే సైకో ఫ్యామిలీ మర్యాద… అతిథులను ఆహ్వానించి అన్నీ విప్పించి… మస్ట్ వాచ్ సైకలాజికల్ థ్రిల్లర్

కానీ ఇక్కడి నుంచి హారర్ స్టార్ట్ అవుతుంది. బుస్సాబా ఆత్మ తిరిగి మళ్ళీ వస్తుంది. మొదట టీమ్ మెంబర్లను టార్గెట్ చేస్తుంది. వాళ్ళల్లో ఒక్కొక్కరు విచిత్రంగా మరణిస్తారు. జిన్ తన స్నేహితులతో కలసి ఒక షమన్ ని కలుస్తుంది. దీంతో కథ మరింత భయంకరంగా మారుతుంది. బుస్సబా తన రివేంజ్ ని తీర్చుకుంటుందా ? జిన్ ఈ రివేంజ్ నుంచి బయట పడుతుందా ? అనే విషయాలను, ఈ థాయ్ హారర్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

 

Related News

OTT Movie : ఏం సినిమా మావా… ఒక్కొక్క సీన్ కు రోమాలు నిక్కబొడుచుకోవడం పక్కా… హార్ట్ వీక్‌గా ఉన్నవాళ్ళు అస్సలు చూడొద్దు

OTT Movie : టీనేజ్ పాప మిస్సింగ్ తో టీచర్‌కు లింక్… నరాలు కట్టయ్యే ఉత్కంఠ

OTT Movie : దెయ్యాలకు ప్యాంట్ తడిపించే అన్నదమ్ములు… ఐఎండీబీలో 8.4 రేటింగ్… ఒక్కో సీన్ దబిడి దిబిడే

OTT Movie : ఐలాండ్‌లో అరాచకం… ఒకే అమ్మాయితో ఇద్దరబ్బాయిలు… ఫ్యామిలీతో చూడకూడని మూవీ మావా

OTT Movie : అన్నతో పెళ్ళి తమ్ముడితో యవ్వారం… ఈ క్రేజీ కొరియన్ సిరీస్ కెవ్వు కేక

OTT Movie : సైకో కిల్లర్స్‌తో నిండిపోయే హోటల్… గ్రిప్పింగ్ స్టోరీ, సీట్ ఎడ్జ్ థ్రిల్… బ్లడీ బ్లడ్ బాత్

OTT Movie : భర్త బట్టల్లో మరో అమ్మాయి వెంట్రుకలు… ఆ భార్య ఇచ్చే షాక్‌కు ఫ్యూజులు ఔట్

Big Stories

×