OTT Movie : క్రైమ్, మిస్టరీ, సూపర్ నాచురల్ హారర్ థీమ్స్ తో ఒక సిరీస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఒక గ్రిప్పింగ్ స్టోరీతో ఇంటెన్స్ గా ఈ కథ ఉంటుంది. ఒక బాలుడు హత్య ఇన్వెస్టిగేషన్ తో మొదలయ్యే ఈ స్టోరీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్ టర్న్ తీసుకుంటుంది. ఒక స్పిరిట్ ఎంట్రీతో కథ పూర్తిగా మారిపోతుంది. క్లైమాక్స్ మరింత భయంకరంగా ఉంటుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘ది అవుట్‌సైడర్’ (The Outsider) 2020లో విడుదలైన అమెరికన్ హారర్ మినీ సిరీస్. స్టెఫెన్ కింగ్ 2018 నవల ఆధారంగా రూపొందింది. జేసన్ బేట్ మన్ దీనిని డైరెక్ట్ చేశాడు. 10 ఎపిసోడ్‌లతో కూడిన ఈ సిరీస్, 2020 జనవరి 12 నుండి హెచ్ బి ఓ మ్యాక్స్, జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఐయండిబిలో 7.6/10 రేటింగ్ ని పొందింది.
జార్జియా అనే చిన్న ఊరిలో 11 ఏళ్ల పాప ఫ్రాంకీ శరీరంను ముక్కలు ముక్కలు చేసి దారుణంగా చంపేస్తారు. పోలీసు డిటెక్టివ్ రాల్ఫ్ ఈ కేస్ తీసుకుంటాడు. స్కూల్ టీచర్ టెర్రీ పై అనుమానం వస్తుంది. వీడియోలు, DNA రిపోర్ట్ లు టెర్రీనే దోషిగా చూపిస్తాయి. కానీ టెర్రీ అదే రోజు దూరంగా ఒక కాన్ఫరెన్స్‌లో ఉన్నాడు. ఇది ఇంపాసిబుల్ క్రైమ్. అయినా కూడా రాల్ఫ్ టెర్రీని అరెస్ట్ చేస్తాడు. టౌన్ ప్రజలు కోపంగా టెర్రీని కాల్చి చంపేస్తారు. దీంతో రాల్ఫ్ గిల్టీగా, తప్పు చేశానా అని ఫీల్ అవుతాడు. రాల్ఫ్ ఇంకా ఆ కేస్ ను వదలడు. ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ హాలీ అనే మహిళ కూడా హెల్ప్ చేస్తుంది. ఆమె సూపర్ నాచురల్ థింగ్స్ ని నమ్ముతుంది. ఆమె ఎవిడెన్స్ చూస్తూ ఉన్నప్పుడు, ఒక చెడు భూతం టెర్రీ బాడీలోకి ఎంటర్ అయి హత్య చేసినట్లు తెలుస్తుంది.
Read Also : భార్య కళ్ళముందే విదేశీ అమ్మాయితో… అన్నీ అవే సీన్లు… కల్లోనూ కలవరింతలు పుట్టించే కథ