 
					OTT Movie : కాన్‌ట్రాక్ట్ మ్యారేజ్, ఫ్యామిలీ సీక్రెట్స్, లవ్ ట్రయాంగిల్ థీమ్స్ తో ఒక కొరియన్ రొమాంటిక్ సిరీస్ ఓటీటీలో ట్రెండింగ్ అవుతోంది. ఈ మధ్య కొరియన్ సిరీస్ లను ప్రేక్షకులు తెగ చూసేస్తున్నారు. ఎక్కడ చూసినా రొమాంటిక్ సిరీస్ లు దర్శనం ఇస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్, అన్నా తమ్ముళ్ల మధ్య జరిగే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ చుట్టూ తిరుగుతుంది. కొరియన్ రొమాంటిక్ స్టోరీల ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సిరీస్ ఇది. దీని పేరు ఏమిటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘వెడ్డింగ్ ఇంపాసిబుల్’ (Wedding Impossible) అనేది 2024లో విడుదలైన సౌత్ కొరియన్ రొమాంటిక్ కామెడీ సిరీస్. సాంగ్ జెంగ్-వన్ రాసిన ‘వెబ్‌నోవెల్’ అనే నవల ఆధారంగా రూపొందింది. 12 ఎపిసోడ్‌లతో కూడిన ఈ సిరీస్ కి ఐయండిబిలో 7/10 రేటింగ్ ఉంది. ఇది 2024 ఫిబ్రవరి 26 నుంచి Viki, Netflix, Prime Videoలో అందుబాటులోకి వచ్చింది.
అజెంగ్ ఒక చిన్న యాక్ట్రెస్. అయితే ఆమెకు అవకాశాలు పెద్దగా ఏమీ రావు. ప్రస్తుతం డబ్బు కూడా లేదు. ఆమె బెస్ట్ ఫ్రెండ్ డో-హాన్ ఒక పెద్ద కంపెనీ ఓనర్ కొడుకు . కానీ అతను గే అని కొందరు అనుకుంటూ ఉంటారు. ఫ్యామిలీ ఒత్తిడి వల్ల డో-హాన్ అజెంగ్‌తో పెళ్ళికి ఒప్పుకుంటాడు. కానీ ఆమెకు డబ్బు ఆఫర్ ఇచ్చి, ఫేక్ మ్యారేజ్ చేసుకోమంటాడు. డబ్బు కోసం అజెంగ్ ఒప్పుకుంటుంది. కానీ డో-హాన్ తమ్ముడు జీ-హాన్ ఈ వెడ్డింగ్ ఆపాలని ప్లాన్ చేస్తాడు. అన్న కంపెనీ CEO కాకూడదని, తనే అవ్వాలని అనుకుంటాడు. ఈ సమయంలో ఎంగేజ్‌మెంట్ పార్టీ జరుగుతుంది. జీ-హాన్ అజెంగ్‌ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఆమె పాత బాయ్‌ఫ్రెండ్ ను తెచ్చి గొడవ పెట్టిస్తాడు. కానీ అజెంగ్ స్మార్ట్ గా జీ-హాన్‌ను రివర్స్‌లో ఇబ్బంది పెడుతుంది. ఇద్దరూ ఒకరినొకరు ద్వేషించుకుంటారు.
Read Also : మొగుడి శవంతో పెళ్ళాన్ని కుడా వదలకుండా… ఈ అరాచకాన్ని చూడలేం భయ్యా
కానీ ఇప్పటి నుంచి వీళ్ళ మధ్య ప్రేమ మొదలవుతుంది. డో-హాన్ తన బాయ్‌ఫ్రెండ్ తో సీక్రెట్ మీటింగ్స్ పెట్టుకుంటాడు. మరో వైపు రిచ్ లైఫ్‌లో ఫిట్ అవుతుందా అని, అజెంగ్‌ను డో-హాన్ ఫ్యామిలీ టెస్ట్ చేస్తుంది. అయితే అజెంగ్ తన యాక్టింగ్ స్కిల్స్ తో అందరినీ ఇంప్రెస్ చేస్తుంది. ఇంతలో వెడ్డింగ్ దగ్గర పడుతుంది. జీ-హాన్ అన్న సీక్రెట్ బయటపెట్టాలని అనుకుంటాడు. డో-హాన్ ఓపెన్‌గా తన లవర్‌తో ఉండాలని డిసైడ్ అవుతాడు. చివరికి ఈ కథ ఎలాంటి టర్న్ తీసుకుంటుంది ? అన్న గే అని అందరికీ తెలిసిపోతుందా ? ఈ పెళ్లి జరుగుతుందా ? ఈ స్టోరీకి శుభం కార్డ్ పడుతుందా ? అనే విషయాలను, ఈ సౌత్ కొరియన్ రొమాంటిక్ కామెడీ సిరీస్ ను చూసి తెలుసుకోండి.