Swara Bhaskar:సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు అప్పుడప్పుడు అభిమానులతో తమ మనసులోని మాటలను చెబుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న స్వరా భాస్కర్ (Swara Bhaskar) కూడా ఇన్నేళ్లకు తన మనసులో మాట బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ స్టార్ హీరో పై మనసు పడ్డానని.. అది కూడా 10 సంవత్సరాల వయసులోనే అని చెప్పిన ఆమే.. తన గదినిండా ఆ స్టార్ హీరోల ఫోటోలే ఉండేవని చెప్పి ఆశ్చర్యపరిచింది. మరి స్వరాభాస్కర్ ను అంత చిన్న వయసులోనే ఆకర్షించిన ఆ హీరో ఎవరు? తన ప్రేమ విషయాన్ని ఆ హీరోతో చెప్పిందా? అసలేం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న స్వరా భాస్కర్ మాట్లాడుతూ..” పదేళ్ల వయసులోనే “చురాహై హై దిల్ మేరా” అనే పాట చూసినప్పుడు స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) నా భర్త కావాలని కోరుకున్నాను.. ఆ సమయంలో రాహుల్ ద్రవిడ్ ని కూడా ఆరాధించాను. గది నిండా వీరిద్దరి ఫోటోలు ఉండేవి. అయితే రాజకీయ అభిప్రాయ భేదాల కారణంగా అక్షయ్ తో ఫెయిరీ టేల్ ఫెయిల్ అయింది. నా భర్త కావాలనుకున్న అక్షయ్ కుమార్ ఇంకొకరికి భర్త అయ్యారు.ఆ కోరిక తీరలేదు అంటూ స్వరాభాస్కర్ తన ప్రేమను వ్యక్తపరిచింది. ఇకపోతే ఆ తర్వాత కాలంలో షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) అంటే ఇష్టం పెరిగిందని చెప్పిన ఈమె.. అఖిలేష్ యాదవ్ భార్యపై కూడా తనకు క్రష్ ఉందని చెప్పి ట్రోలింగ్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ పై క్లారిటీ కూడా ఇచ్చింది.
ప్రముఖ సినీనటిగా పేరు సొంతం చేసుకున్న స్వరా భాస్కర్.. 2009లో మధోలాల్ కీప్ వాకింగ్ అనే సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. 2012లో జీ సిని అవార్డ్స్ దక్కించుకున్న ఈమె.. స్క్రీన్ అవార్డ్స్, సిల్క్ రోడ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్, లక్స్ గోల్డెన్ రోజు అవార్డ్స్ వంటివి దక్కించుకుంది.
ALSO READ:Singer Death: హీరో వెంకటేష్ మూవీ సింగర్ మృతి.. మూగబోయిన ఇండస్ట్రీ!
స్వరా భాస్కర్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 2023 ఫిబ్రవరి 16వ తేదీన ఫహద్ అహ్మద్ ను స్వరాభాస్కర్ వివాహం చేసుకున్నారు. ఈయన రాజకీయ నేత మాత్రమే కాదు సామాజిక కార్యకర్త కూడా.. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ స్టూడెంట్స్ యానిమేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన విద్యార్థి సంఘాల నాయకుడు. 2022 జూలైలో సమాజ్ వాదీ పార్టీలో చేరిన ఈయన.. ప్రస్తుతం ఆ పార్టీ మహారాష్ట్ర విభాగం యువజన సభ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.