ZEE5 New Releases September 2026: సెప్టెంబర్ వచ్చేసింది… ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ZEE5 అదిరిపోయే లైనప్‌తో రెడీ అవుతోంది. తమిళం నుంచి హిందీ వరకు, తెలుగు నుంచి మలయాళం, కన్నడ వరకు… ఒకేసారి పలు భాషల్లో కొత్త కంటెంట్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. సినిమాలతో పాటు క్రైమ్, కామెడీ, డ్రామా, రియాలిటీ, నాన్ ఫిక్షన్ ఇలా డిఫరెంట్ జానర్లలో కంటెంట్ ఉండటంతో ఈ నెల ఓటీటీ ఆడియన్స్ కు జీ5 ఇచ్చే ట్రీట్ తో ఎంజాయ్ పండగో. మరి సెప్టెంబర్‌లో జీ5లో రాబోతున్న సినిమాలు, సిరీస్‌లు ఏంటి? ఏ భాషలో ఏ కంటెంట్ అందుబాటులోకి రాబోతోంది? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.
జీ5లో ఈ నెల స్ట్రీమింగ్ కానున్న తమిళ కంటెంట్‌లో Sattamum Needhiyum 2 అనే సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు HI అనే నయనతార మూవీ కూడా లిస్టులో ఉంది. ఇక Thee Kural పేరుతో నాన్ ఫిక్షన్ కంటెంట్ కూడా రాబోతోంది. దీంతో తమిళ ఆడియన్స్‌కు సినిమా, సిరీస్‌తో పాటు నాన్ ఫిక్షన్ కంటెంట్ కూడా అందుబాటులోకి రానుంది.
తెలుగులో Veerabhadruni Rahasyam Season 1 Part 2పై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మొదటి భాగంతో క్యూరియాసిటీ పెంచిన ఈ సిరీస్ రెండో పార్ట్‌లో కథ ఎలాంటి మలుపులు తీసుకుంటుందనేది చూడాలి. అలాగే Panchnama అనే మరో సిరీస్ కూడా జీ5 సెప్టెంబర్ లైనప్‌లో ఉంది.
మలయాళంలో మాత్రం మరింత వైవిధ్యమైన కంటెంట్ కనిపిస్తోంది. Panthadikkam సిరీస్, Varavu, Bandra సినిమాలతో పాటు Kerala Underground నాన్ ఫిక్షన్ కంటెంట్ కూడా రానుంది. ముఖ్యంగా హిప్ హాప్, ర్యాప్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ‘కేరళ అండర్ గ్రౌండ్’ఇప్పటికే మ్యూజిక్ లవర్స్‌లో ఆసక్తి పెంచుతోంది.
కన్నడలో Corporate Love Story Season 1, Halli Power అనే రెండు సిరీస్‌లు లైనప్‌లో ఉన్నాయి. ఇక హిందీలో Ghamasaan మూవీ, Bakaiti Season 2 సిరీస్‌తో పాటు Legacy అనే నాన్ ఫిక్షన్ కంటెంట్ కూడా రాబోతోంది. Legacy ఎపిసోడ్లు ప్రతి మంగళవారం, శుక్రవారం విడుదల కానున్నాయి.
ఇక మరాఠీ, ఇంగ్లీష్ ప్రేక్షకుల కోసం కూడా జీ5 ప్రత్యేక కంటెంట్‌ను అందుబాటులోకి తెస్తోంది. మరాఠీలో ‘Adkitta’ సినిమా రాబోతుండగా, ఇంగ్లీష్‌లో ‘Normal’, ‘The Wizard Of The Kremlin’ చిత్రాలు అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక చిన్నారుల కోసం కిడ్స్ విభాగంలో ‘Bandbudh And Budbak 2.0’, ‘Smart Kidz’ వంటి వినోదాత్మక సిరీస్‌లు లైనప్‌లో ఉన్నాయి. వీటితో పాటు స్పోర్ట్స్ లవర్స్ కోసం Bundesliga, Serie A, Coppa Italia, FIFA U20 Women’s World Cup మ్యాచ్‌లను కూడా ఈ నెల జీ5లో వీక్షించవచ్చు.
మొత్తానికి ZEE5 విడుదల చేసిన సెప్టెంబర్ లైనప్ ప్రకారం తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లోని మోస్ట్ అవైటింగ్ సినిమాలు, సిరీస్ లు ఈ నెల అందుబాటులోకి రానున్నాయి. సెప్టెంబర్‌లో ఒకే ప్లాట్‌ఫామ్‌లో ఇన్ని భాషలు, ఇన్ని జానర్ల కంటెంట్ కావాలనుకునేవారికి జీ5 లైనప్ డిఫరెంట్‌గా ఉండబోతోంది. కొత్త సిరీస్‌లు, మల్టీ లాంగ్వేజ్ సినిమాలు, నాన్ ఫిక్షన్ కంటెంట్ ఇష్టపడేవాళ్లు ఈ నెల జీ5పై ఓ కన్నేయొచ్చు, ఇక తెలుగులో ‘వీరభద్రుని రహస్యం సీజన్ 1 పార్ట్ 2’తో పాటు ‘పంచనామా’ అందుబాటులో ఉంటుంది. ఈ రెండూ కూడా సిరీస్లే కావడం విశేషం. కాబట్టి డోంట్ మిస్.
Read Also: ఆ పాత భవంతిలో ఉంటే చస్తారు… దెయ్యాల కోట వెనుక ఉన్న భయంకరమైన మిస్టరీ స్ట్రీమింగ్ తెలుగులో