
Ananya Nagalla (Image Credit: Instagram)
ప్రముఖ తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ళ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వెంకటేశ్వరరావు , విష్ణు ప్రియా దంపతులకు తెలుగు కుటుంబంలో జన్మించింది.

Ananya Nagalla (Image Credit: Instagram)
తండ్రి వ్యాపారవేత్త.. అనన్య నాగళ్ళ చదువు నిమిత్తం హైదరాబాదుకి తరలివచ్చింది వీరి కుటుంబం. ఆమె ఇబ్రహీంపట్నంలోని రాజా మహేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేసి.. ఆ తర్వాత ఇన్ఫోసిస్ లో కొంతకాలం ఉద్యోగిగా పనిచేసింది.

Ananya Nagalla (Image Credit: Instagram)
సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సమయంలోనే షాదీ అనే షార్ట్ ఫిలింలో నటించి సైమా షార్ట్ ఫిలిం అవార్డులలో ఉత్తమ నటిగా నామినేట్ చేయబడింది. ఆ తర్వాత 2019లో ప్రియదర్శితో కలిసి మల్లేశం సినిమాలో నటించి హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది.

Ananya Nagalla (Image Credit: Instagram)
అలాగే ప్లే బ్యాక్ అనే సైన్స్ ఫిక్షన్ డ్రామాలో కూడా కనిపించింది ఈ ముద్దుగుమ్మ.. ఇక పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో మంచి పేరు దక్కించుకున్న ఈమె.. నరేష్ మళ్లీ పెళ్లి సినిమాలో కూడా సందడి చేసింది.

Ananya Nagalla (Image Credit: Instagram)
ప్రస్తుతం లేచింది మహిళా లోకం అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఈమె.. మరొకవైపు అందాలు ఆరబోస్తూ భిన్నభిన్నమైన వస్త్రధారణతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే

Ananya Nagalla (Image Credit: Instagram)
ఇకపోతే తాజాగా బైక్ రైడ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. విన్నవిభిన్నమైన స్టైలిష్ ఫోజులతో కుర్ర కారుకు పిచ్చెక్కించింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా అనన్య షేర్ చేసిన ఈ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.