Roja Daughter Anshu Malika(Source: Instragram)
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఆర్కే రోజా అటు రాజకీయాలలో కూడా చక్రం తిప్పిన విషయం తెలిసిందే.
Roja Daughter Anshu Malika(Source: Instragram)
ప్రస్తుతం పలు టీవీ షోలలో సందడి చేస్తున్న ఈమె ఎప్పటికప్పుడు అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉండగా ఈమె వింటేజ్ లుక్కును మరొకసారి ఆమె కూతురు గుర్తుచేసింది అని చెప్పవచ్చు.
Roja Daughter Anshu Malika(Source: Instragram)
రోజా కూతురు అన్షు మాలిక రోజా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎలా అయితే ఉందో.. అలాగే ఆమె కూడా తనను తాను మార్చుకొని ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అచ్చం తల్లిలాగే ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Roja Daughter Anshu Malika(Source: Instragram)
మరి కొంతమంది రోజాను వింటేజ్ లుక్ లో చూసినట్టు ఉంది అని కామెంట్లు చేయగా.. ఇంకొంతమంది తల్లికి జిరాక్స్ అంటూ ఇలా ఎవరికి వారు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
Roja Daughter Anshu Malika(Source: Instragram)
ప్రస్తుతం రోజా కూతురు అన్షు మాలికకి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అన్షు విషయానికి వస్తే.. సామాజిక ప్రభావ కృషికి ప్రసిద్ధి చెందిన ఈమె.. సామాజిక ప్రభావంలో గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ అవార్డును సొంతం చేసుకుంది.
Roja Daughter Anshu Malika(Source: Instragram)
ఆర్ట్ ఫర్ ఏ కాజ్ అనే ఒక సొంత కంపెనీ కూడా నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ద్వారా వచ్చే లాభాలను పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో దృష్టి పెట్టింది.