Anupama parameswaran (Source: Instragram)
అనుపమ పరమేశ్వరన్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ - సమంత జంటగా వచ్చిన అ ఆ సినిమాతో తన అద్భుతమైన నటన కనబరిచి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Anupama parameswaran (Source: Instragram)
శతమానం భవతి సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. శర్వానంద్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది.

Anupama parameswaran (Source: Instragram)
ఆ తర్వాత పలువురు యంగ్ హీరోల సరసన నటించి భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. మధ్యలో కొన్ని కారణాలవల్ల అవకాశాలు అందుకోలేకపోయింది.

Anupama parameswaran (Source: Instragram)
ఇక ఈ ఏడాది కిష్కింధపురి, పరదా, బైసన్ అంటూ వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది.

Anupama parameswaran (Source: Instragram)
ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపించిన అనుపమ.. కలర్ఫుల్ వస్త్రధారణలో కనిపించి అభిమానులను ఆకట్టుకుంది. 2025 జ్ఞాపకాలను తలుచుకుంటూ గడిచిన ఏడాదికి బై బై చెబుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలికింది.

Anupama parameswaran (Source: Instragram)
ప్రస్తుతం అనుపమ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.