Bellamkonda Sai Srinivas (image credit: internet)
ప్రస్తుత కాలంలో టాలీవుడ్ హీరోలు ఒకరి తర్వాత ఒకరు వైవాహిక బంధం లోకి అడుగుపెడుతుంటే.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా కావ్య రెడ్డి తో నిశ్చితార్థం చేసుకున్నారు.

Bellamkonda Sai Srinivas (image credit: internet)
హైదరాబాదులోని ఒక రిసార్ట్ లో ఈ శుభకార్యం చాలా ఘనంగా జరిగింది. కాబోయే నూతన వధూవరులు ఇద్దరు కూడా అందమైన డ్రెస్ లో మెరిసిపోయారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Bellamkonda Sai Srinivas (image credit: internet)
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కావ్య రెడ్డి కాబోయే దంపతులకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు, సినీ సెలబ్రిటీలు , నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Bellamkonda Sai Srinivas (image credit: internet)
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విషయానికి వస్తే.. నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్దకొడుకు అయిన ఈయన.. హీరోగా పలు సినిమాలు చేశారు.. అల్లుడు శ్రీను సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన.. గత ఏడాది కిష్కింధపురి సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ఈయన ఖాతాలో మూడు చిత్రాలు ఉండడం గమనార్హం.

Bellamkonda Sai Srinivas (image credit: internet)
ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాబోయే భార్య విషయానికి వస్తే ఈమె హైదరాబాద్ అమ్మాయి.. పైగా ఈమె తాత జడ్జి కాగా ఈమె తండ్రి లాయర్ గా పనిచేస్తున్నారు.

Bellamkonda Sai Srinivas (image credit: internet)
ఇకపోతే వీరిద్దరూ ఈనెల 29వ తేదీన తిరుపతిలో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.