E-Paper
Advertisement

ధనుష్ లో మా నాన్నను చూసుకున్నా.. గొడవపడి తప్పు చేశా: విగ్నేష్ శివన్

ధనుష్ లో మా నాన్నను చూసుకున్నా.. గొడవపడి తప్పు చేశా: విగ్నేష్ శివన్
Advertisement

Vignesh Shivan: కోలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నయనతార భర్త విగ్నేష్ శివన్(Vignesh Shivan) ఒకరు. దర్శకుడుగా పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన త్వరలోనే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (Lik)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా జులై 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో విడుదల కాబోతున్న నేపథ్యంలో తెలుగులో కూడా ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు.

నయనతారతో ధనుష్ కు విభేదాలు…

ఇక ఈ సినిమాని తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ విగ్నేష్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని నటుడు ధనుష్ (Danush)తో తలెత్తిన వివాదం గురించి ఆయనతో ఫ్రెండ్షిప్ విడిపోవడం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ధనుష్ సినిమాకు సంబంధించి ఒక విషయంలో నయనతార(Nayanthara)తో గొడవ జరిగి కోర్టు వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ విషయం తర్వాత ధనుష్ విగ్నేష్ మధ్య మాటలు లేవు. ఈ విషయాల గురించి విగ్నేష్ మాట్లాడుతూ..

ధనుష్ లో మా నాన్నను చూసుకున్నాను..

Advertisement

ఈ సందర్భంగా విగ్నేష్ మాట్లాడుతూ ధనుష్ అంటే నాకు చాలా ఇష్టం ఆయన పుట్టిన రోజు జులై 28వ తేదీ. ఆయన పుట్టినరోజు నాడే మా నాన్న కూడా మరణించారు. దీంతో ధనుష్ లో మా నాన్నను చూసుకున్నాను. ప్రస్తుతం నేను ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు కారణం ధనుష్ అని తెలిపారు. ఒకానొక సమయంలో మా ఇద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉండేది కానీ ఇప్పుడు ఆ అనుబంధం లేదని తెలిపారు. ఇలా మా ఇద్దరి మధ్య తలెత్తిన వివాదాలకు తాను సిగ్గుపడుతున్నానని ధనుష్ తెలిపారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా సమస్య ఉంటే కూర్చొని ఆ సమస్య గురించి మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి కానీ, మా మధ్య మాత్రం అలాంటిది జరగలేదు.

డాక్యుమెంటరీ విషయంలో విభేదాలు..

Advertisement

నేను నా తండ్రిలా చూసుకున్న హీరో ధనుష్ తో మా ఫ్రెండ్ షిప్ విడిపోవడంతో నేను పశ్చాత్తాపడుతున్నానని విగ్నేష్ తెలిపారు. నయనతార విగ్నేష్ పెళ్లి సమయంలో వీరి డాక్యుమెంటరీ లో భాగంగా ధనుష్ నిర్మించిన సినిమా నుంచి ఆయన అనుమతి లేకుండా ఆ సినిమా నుంచి చిన్న వీడియో క్లిప్ వాడిన నేపథ్యంలోనే వివాదం చోటుచేసుకుంది. ఆ సమయం నుంచి వీరి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. ఇలా వీరి మధ్య వచ్చిన భేదాభిప్రాయల గురించి ఈయన స్పందిస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక చాలా రోజుల తర్వాత విగ్నేష్ డైరెక్షన్లో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .ఈ సినిమాకు నయనతార నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఇందులో ప్రదీప్ రంగనాథన్ జోడిగా కృతి శెట్టి నటిస్తున్నారు.

Also Read: ప్రేమపై త్రిష ఆసక్తికర పోస్టు.. ప్రేమ లేకపోతే అర్థం లేదంటూ..

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×