
Bellamkonda Sai Srinivas(Image Credit: Instagram)
ప్రముఖ నిర్మాత సురేష్ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు సాయి శ్రీనివాస్. అల్లుడు శీను సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన.. తన మొదటి సినిమాలోనే స్టార్ హీరోయిన్ సమంత సరసన నటించే అవకాశాన్ని అందుకున్నారు.

Bellamkonda Sai Srinivas(Image Credit: Instagram)
ఈ చిత్రం ద్వారానే ప్రకాష్ రాజ్ కూడా ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సాయి శ్రీనివాస్ చివరిగా భైరవం, కిష్కిందపురి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Bellamkonda Sai Srinivas(Image Credit: Instagram)
ప్రస్తుతం నిశ్చితార్థం చేసుకొని అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. తన ప్రేయసి కావ్య రెడ్డి తో ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యారు సాయి శ్రీనివాస్.

Bellamkonda Sai Srinivas(Image Credit: Instagram)
అందులో భాగంగానే ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు, సినీ సెలబ్రిటీల మధ్య నిశ్చితార్థం జరుపుకున్నారు . ఈ వేడుకకు పలువురు దర్శకులు , సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు.

Bellamkonda Sai Srinivas(Image Credit: Instagram)
ప్రముఖ దర్శకులు శ్రీనువైట్ల, గోపీచంద్ మలినేని, వీవీ వినాయక్, అనిల్ రావిపూడి వంటి దర్శకులతో పాటు సినీ నటి సంయుక్త మీనన్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

Bellamkonda Sai Srinivas(Image Credit: Instagram)
సాయి శ్రీనివాస్ , కావ్య రెడ్డి నిశ్చితార్థ వేడుకల్లో సినీ తారలు సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కాబోయే నూతన జంటకు సినీ సెలబ్రిటీలు , రాజకీయ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఈ ఏడాది ఆఖరిలో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం.

e8ba1bc7-b305-4c7b-969e-91d83308fa59

a8dab6b4-da7c-4cf1-9d5c-d52926bca8a4

214524ad-37ce-4736-a3cb-e5caf1e584ef

d8afd3fb-7247-4ab6-b7e0-1efde6c1c66e

308022e9-3e79-47e0-96e9-93e84fe0062d

924373e3-ff3f-4595-a275-0de21e156c08

99a21a5f-3a1a-4fc3-ae95-9a947524ae08

db644fe6-e1fb-4957-9734-e066e7cbbb56

80f87715-4fa0-4781-a478-6c38d35ae18d

770d2f81-0709-41cd-b0a1-0872b7939528

44b2fac7-f880-49f3-9cc6-4ed11df68c53

261a3cc2-bccd-44a0-ad72-1c211fa1f776

04680e80-5269-4e9b-9369-65c092bec819

251fb68b-8368-4ca0-9c14-0a88390b2a0f