
Divya Bharathi (Image credit: Instagram)
ప్రముఖ తమిళ హీరోయిన్ దివ్యభారతి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒక ప్రొఫెషనల్ మోడల్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత నటన రంగంలోకి అడుగు పెట్టింది.

Divya Bharathi (Image credit: Instagram)
బ్యాచిలర్ సినిమాతో మంచి పేరు సొంతం చేసుకున్న దివ్యభారతి.. 2016 ప్రిన్సెస్ ఆఫ్ కోయంబత్తూర్ టైటిల్ ను సొంతం చేసుకుంది. అలాగే మోడలింగ్, ప్రకటనల రంగాలలో పాపులర్ న్యూ ఫేస్ మోడల్‌గా కూడా టైటిల్ దక్కించుకుంది.

Divya Bharathi (Image credit: Instagram)
బ్యాచిలర్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అరంగేట్రం చేసినప్పటికీ.. 2017లో వచ్చిన ముప్పరిమానం సినిమాతో ఇండస్ట్రీలోకి క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడుగు పెట్టింది.

Divya Bharathi (Image credit: Instagram)
ఆ తర్వాత మహారాజా, కింగ్ స్టన్ వంటి చిత్రాలలో ప్రేక్షకులను అలరించిన ఈమె.. సుధీర్ హీరోగా నటిస్తున్న గోట్ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి పరిచయం కాబోతోంది.

Divya Bharathi (Image credit: Instagram)
మొన్నామధ్య అల్లు అర్జున్ తో కలిసి దుబాయ్‌లో దిగిన ఫోటోతో సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె .. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని రకాల ఫోటోలు షేర్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

Divya Bharathi (Image credit: Instagram)
అందులో భాగంగానే ట్రెండీ అవుట్ ఫిట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. ఇందులో తన అందాలు ఆరబోస్తూ అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసింది. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ వేదికగా ఈమె పంచుకున్న ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.