
Genelia (Source / Instagram )
హహహ హాసిని అన్న పేరు వినగానే అందరికీ టక్కును గుర్తొచ్చేది జెనీలియా.. ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది..

Genelia (Source / Instagram )
బొమ్మరిల్లు, రెడీ వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది.. టాలీవుడ్ లో చాలా కాలం స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగించింది.

Genelia (Source / Instagram )
బాయ్స్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జెనీలియా.. స్ట్రైట్ గా తెలుగులో నటించిన చిత్రం సత్యం... క్యూట్ లుక్ లో నాజూకు అందాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చింది ఈ ముద్దుగుమ్మ..

Genelia (Source / Instagram )
అల్లు అర్జున్, ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి స్టార్ హీరోస్ సరసన స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ కొన్ని ప్లాప్ అయ్యాయి.హ్యాపీ, సాంబ, ఆరెంజ్ చిత్రాలే అందుకు ఉదాహరణ. బొమ్మరిల్లు చిత్రంలో హాసినిగా జెనీలియా నటనని ఎప్పటికి మరిచిపోలేం..

Genelia (Source / Instagram )
పెళ్లి తర్వాత జెనీలియా సినిమాలకు గుడ్ బై చెప్పింది. కానీ ఇప్పటికి జెనీలియా కుర్ర భామలాగే ఉంటుంది. 2012లో జెనీలియా నటుడు రితేష్ దేశముఖ్ ని వివాహం చేసుకుంది.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

Genelia (Source / Instagram )
ఒకవైపు చేతినిండా సినిమాలు ఉన్నా సరే సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా ఈమె పింక్ శారీలో రాజమాత లాగా రెడీ అయ్యి చూపు తిప్పుకోకుండా చేస్తుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి...