
Honey Rose ( Source/Instagram )
అందం, అభినయం ఉన్నప్పటికీ కొందరు హీరోయిన్లు కెరీర్లో స్థిరపడలేరు. కానీ ప్రతిరోజూ బిజీగానే ఉంటారు.. ఆ లిస్టులోకి బొద్దుగుమ్మ హనీ రోజ్ కూడా చేరింది.. కేరళ కుట్టి అయిన ఈ ముద్దుగుమ్మ ఈమధ్య బాగా బిజీగా మారింది.

Honey Rose ( Source/Instagram )
తన స్మైల్, ఛార్మింగ్ లుక్‌తోనే ఫిదా చేసేస్తారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే హనీరోజు.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు కొన్ని కుర్రాళ్లకు మతి పోగొడుతున్నాయి.

Honey Rose ( Source/Instagram )
14 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 2005లో వినయన్ దర్శకత్వంలో వచ్చిన బాయ్‌ఫ్రెండ్ అనే మూవీలో నటించింది. ఆ మూవీ తర్వాత తెలుగులో ఆలయం అనే మూవీలో నటించింది.

Honey Rose ( Source/Instagram )
త్రివేండ్రం లాడ్జి, హోటెల్ కాలిఫోర్నియా, థ్యాంక్యూ, యూ టూ బ్రూటస్ సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. మలయాళ స్టార్ హీరోలు మోహన్‌లాల్ వంటి స్టార్స్ తో నటించింది..

Honey Rose ( Source/Instagram )
దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆమెకు టాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డిలో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత పెద్దగా సినిమాలలో కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.

Honey Rose ( Source/Instagram )
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో రెడ్ డ్రస్సులోని క్యూట్ ఫోటోలను షేర్ చేసింది. ఎప్పుడూ హాట్ లుక్ లో కనిపించే ఈ అమ్మడు ఇప్పుడు సింపుల్‌గా కనిపించడంతో జనాలు ఫిదా అవుతున్నారు.. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి..