inaya sultana (5)
Inaya Sultana Latest Photos: ఇనయా సుల్తానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వివాదస్పద దర్శకుడు ఆర్జీవీతో డ్యాన్స్ వీడియోతో ఈ భామ బాగా వైరల్ అయ్యింది. దీంతో అంతా ఇనయా గురించి ఆరా తీస్తూ ఆమె గురించి గుగూల్ వెతికేశారు.
inaya sultana (1)
అలా లైమ్‌లైట్‌లోకి వచ్చిన ఈమె.. అదే క్రేజ్‌తో బిగ్‌బాస్ ఆఫర్ అందుకుంది. హౌజ్‌లో తనదైన ఆటతో ఆకట్టుకుంటు.. సంబంధం లేని మాటలతో వైరల్ అయ్యింది. హౌజ్‌లో ప్రతి ఒక్కరితో గొడవలు పడుతూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.
inaya sultana (2)
కాంట్రవర్సీలతో సేవ్ అవుతూ.. హౌజ్‌లో ఎక్కువ కాలం ఉంది. అంతేకాదు ఓ వీక్ కెప్టెన్ కూడా అయ్యింది. ఇక బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇనయా.. ప్రస్తుతం ప్రైవేట్ అల్భమ్ సాంగ్స్, షో రూం ఒపెనింగ్స్తో బిజీగా ఉంది.
inaya sultana (7)
మరోవైపు అడపదడపా చిత్రాలు చేస్తూ కెరీర్లో ముందుకు వెళుతుంది. ఆ మధ్య ప్రియుడితో చెట్టాపట్టేలేసుకుని తిరిగిన ఇనయా ఈ మధ్య సింగిల్గాకనిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ సింగిల్ ఫోటోలు షేర్ చేస్తోంది. దీంతో ప్రియుడితో బ్రేకప్ అయిందనేది అర్థమైపోతుంది.
inaya sultana (3)
అయితే ఈ మధ్య ఈ భామ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. అయితే ఈ మధ్య ఇనయా తరచూ గుర్రపు స్వారీ చేస్తూ కనిపిస్తోంది.
inaya sultana (6)
వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ మురిసిపోతుంది. తాజాగా మరోసారి ఇనయా గుర్రపు స్వారీ చేసిన ఫోటోలు షేర్ చేసింది. దీనికి 'రెయిన్, గ్రీన్, హార్స్.. ఇవన్నీ కూడా నాకు ఇష్టమైనవి' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
inaya sultana (4)
ఇనయా ఫోటోలపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ధైర్యవంతురాలివి, వావ్ ఇనయా సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇనయా ఫోటోలు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి.