రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాలకు రహదారులు, వాగులు పొంగి పొర్లు తున్నాయి. మరోవైపు మూసీలో వదర భారీగా చేరడంతో ఉగ్రరూపం దాల్చుతుంది. దీంతో ఈ వరదలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. దీంతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం యువకుడి కోసం రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టింది. యువకుడు మూసీ వరదలో చిక్కుకుని చెట్టును పట్టుకుని సహాయం కోసం ఆర్తనాదాలు పెట్టాడు. వరద ఎక్కువగా ఉండటంతో స్థానికులు యువకుడిని కాపాండేందుకు ఎవరూ ముందుకు రాలేదు. వెంటనే కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
అయితే రెస్క్యూ టీమ్, అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి ఘటనా స్థలంలో యువకుడు కనిపించలేదు. ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో యువకుడి జాడ కోసం రెస్క్యూ టీమ్, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈనేపథ్యంలో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని సన్‌సిటీలో ఘటన వెలుగుచూసింది. ఈఘటనతో రాజేంద్రనగర్‌లోని సన్‌సిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు. మూసీ ఉగ్రరూపం దాల్చుతుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చూసించారు. గల్లంతైన యువకుడు ఎవరు? అతని కోసం ఆరా తీస్తున్నారు. యువకుడి జాడ కోసం గాలిస్తున్నారు.
నిన్న తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లడంతో రాకపోకలు స్తంభించాయి. జిల్లాల వారిగా చాలా చోట్ల రోడ్లు, కాలనీల పైకి వరద నీరు చేరడంతో జనజీవనం అతలాకుతలమైంది. ఇంకా ఐదు రోజులపాటు భారీ వర్షాలకు తోడు అతి భారీ వర్షాలు పడుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. వచ్చే రెండ్రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నార్త్ హైదరాబాద్, సికింద్రాబాద్ వైపు ఏకంగా 20 సెంటిమీటర్ల వర్షం పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇవాళ, రేపు కూడా నగరంలో భారీ వర్ష సూచన నమోదైంది. జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్, హైడ్రా లాంటి సిబ్బంది అన్ని వర్గాల వారికి సెలవులు రద్దు చేస్తూ కమిషనర్ కర్ణన్, కలెక్టర్ హరిచందన ఆదేశాలు జారీ చేశారు.
ఇక మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా జోరువాన కురుస్తుంది. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో అత్యధికంగా 23.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. భీమిని 22.6, రెబ్బెనలో 22 సెం.మీ. వర్షం పడింది. ఉత్తర తెలంగాణలో 17వ తేదీన వర్షపాతం అధికంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించడంతో ఆ జిల్లాల్లో గురువారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నిటికీ సెలవు ప్రకటించింది.
మూసీ వరదలో యువకుడు గల్లంతు..
గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ టీమ్
రాజేంద్ర నగర్ సన్ సిటీ సమీపంలో ఘటన
ఎగువన కురుస్తున్న వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది pic.twitter.com/r3kX0inJk0
— BIG TV Breaking News (@bigtvtelugu) August 14, 2025