Kavya Kalyanram: వల్లంకి పిట్టా .. వల్లంకి పిట్టా అంటూ గంగోత్రి సినిమాలో ఆడిపాడిన పిల్లి కళ్ల చిన్నారి గుర్తుందా.. ? ఆ చిన్నారి పేరే కావ్య కళ్యాణ్ రామ్.
బాలనటిగా కెరీర్ ను ప్రారంభించిన ఈ చిన్నది చిన్నప్పుడే స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.
ఇక బాలనటులుగా నటించనవారు ఇప్పుడు హీరోలుగా హీరోయిన్లుగా టాలీవుడ్కు ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. అలానే కావ్య కూడా మసూద సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
మొదటి సినిమా మసూదతోనే కావ్య మంచి విజయాన్ని అందుకొని ఇండస్ట్రీ దృష్టిలో పడింది. వెంటనే ఈ చిన్నది బలగం సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసింది.
పొట్టి పిల్లా.. పొట్టి పిల్లా అంటూ బలగంలో కూడా అమ్మడు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. బలగం సినిమా ఏ రేంజ్ హిట్ అయ్యిందో అందరికీ తెల్సిందే. ఇక అప్పటి నుంచి కావ్యను బలగం బ్యూటీ అంటూ పిలిచేస్తున్నారు.
బలగం తరువాత పలు సినిమాలు చేసినా కావ్యకు ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు. ప్రస్తుతం కొన్ని సినిమా కథలు వింటున్నట్లు సమాచారం.
ఇక సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో అమ్మడు నిత్యం హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా స్లీవ్ లెస్ డిజైనర్ గౌన్ లో అద్భుతంగా కనిపించింది.
ఎద అందాలను ఆరబోస్తూ.. ఎలాంటి పాత్రలకు అయినా సిద్ధం అన్నట్లు కావ్య అందాల ఆరబోత కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి .