BigTV English
Advertisement

Bengaluru Central Jail: బెంగళూరు సెంట్రల్ జైలు.. ఖైదీలు ఓ రేంజ్‌లో పార్టీ, ఐసిస్ రిక్రూటర్ కూడా

Bengaluru Central Jail: బెంగళూరు సెంట్రల్ జైలు.. ఖైదీలు ఓ రేంజ్‌లో పార్టీ, ఐసిస్ రిక్రూటర్ కూడా

Bengaluru Central Jail: బెంగుళూరు సెంట్రల్ జైలు వ్యవహారం కర్ణాటక ప్రభుత్వానికి అంతుబట్టడం లేదు. ఖైదీలకు సంబంధించి మూడు లేదా ఆరు నెలలకు ఒకటి వీడియో బయటకురావడం కలకలం రేపుతోంది. దీంతో జైలులోని భద్రతా లోపాలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లేటెస్టుగా అలాంటి వీడియో ఒకటి బయటకు రావడం దుమారం రేగుతోంది. దీనిపై జైళ్ల శాఖ విచారణ చేపట్టింది.


రాజభోగాలకు కేరాఫ్ బెంగుళూరు సెంట్రల్ జైలు

పరివర్తన రావడానికి నిందితులను జైలుకి తరలిస్తారు. కానీ అలాంటి జైలు.. రాజభోగాలకు కేరాఫ్‌గా మారితే చెప్పేదేముంది. పరివర్తన ఏమోగానీ, అందులో ఉన్నవారు ఓ గ్యాంగ్‌గా తయారు అవుతారు. బయటకు వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా చెలరేగిపోయే అవకాశముంది. అలాంటిది వ్యవహారాలకు కేరాఫ్‌గా మారింది బెంగుళూరు పరప్పన ఆగ్రహార సెంట్రల్ జైలు.


బెంగళూరు సెంట్రల్ జైలులో ఖైదీలు వీఐపీ సౌకర్యాలు పొందుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఖైదీలు మద్యం తాగుతూ పార్టీ చేసుకొంటున్న మరో వీడియో వైరల్ అయ్యింది. ఈ వ్యవహారంలో అధికారులపై విమర్శలు తీవ్రమయ్యాయి. వారంతా పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మరికొందరైతే మద్యం తీసుకున్నట్లుగా ఉంది.

ఖైదీలకు అక్కడ సకల సౌకర్యాలు

పేరు మోసిన నేరస్థులు ఐసిస్ రిక్రూటర్ జుహైబ్ హమీద్ షకీల్ మన్నా ఉన్నాడు. జాతీయ దర్యాప్తు సంస్థ-NIA వివరాల మేరకు.. అతడు నిధులు సేకరించి ముస్లిం యువతను ఐసిస్‌లో చేరడానికి సిరియాకు పంపాడు. ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. సీరియల్ రేపిస్ట్ ఉమేష్ రెడ్డి విషయానికి వద్దాం. ఈ నిందితుడు మొబైల్ ఫోన్లు వాడుతున్నట్లు కనిపించాడు. వాడి బ్యారక్‌లో ఓ టెలివిజన్ ఉంది. వాడికి మరణశిక్ష విధించింది కోర్టు.

2022 లో మానసిక అనారోగ్యం పేరుతో క్షమాభిక్ష పొందాడు. సుప్రీంకోర్టు అతడికి మరణశిక్షను  30 ఏళ్ల జైలు శిక్షగా మార్చింది. ఆ తర్వాత వైద్యపరంగా ఆరోగ్యంగా ఉన్నాడని ప్రకటించారు అధికారులు. ఈ వీడియో ఇప్పటిది కాదని, 2023 నాటిదని ఇప్పుడు దాన్ని వైరల్ చేస్తున్నారన్నది జైలు అధికారుల వెర్షన్. వైరల్ అయిన దృశ్యాలు వారం కిందట తీసినట్లు తెలుస్తోంది.

ALSO READ:  బీహార్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రస్తావన.. లోకేష్ కౌంటర్లు మామూలుగా లేవుగా

బెంగళూరు జైలుకు సంబంధించిన వీడియోలు వైరల్‌ కావడంతో కర్ణాటక జైళ్ల శాఖ అధికారులు విచారణ చేపట్టారు. మొబైల్ ఫోన్లు లోపలికి ఎవరు తెచ్చారు? ఖైదీలకు ఎలా చేరాయి? ఈ వీడియో ఎప్పటిది? అనే విషయాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

ఈ వ్యవహారంపై సీఎం సిద్ధరామయ్య రియాక్ట్ అయ్యారు. జైలులోని పరిస్థితులపై ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా దోషులపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు.

 

Related News

UP Lovers Incident: UPలో దారుణం.. లవర్‌ను గన్‌తో కాల్చి.. తర్వాత ప్రియుడు కూడా..

Nara Lokesh: బీహార్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రస్తావన.. లోకేష్ కౌంటర్లు మామూలుగా లేవు

Earthquake In Japan: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

Blood Flow ECMO: మరణించిన తర్వాత కూడా రక్త ప్రసరణ.. ఆసియాలో తొలిసారిగా ఎక్మో టెక్నిక్

Center Scrap Selling: స్క్రాప్ అమ్మితే రూ.800 కోట్లు.. చంద్రయాన్-3 బడ్జెట్ ను మించి ఆదాయం

Karregutta Operation: హిడ్మా పని ఖతం! కర్రెగుట్టను చుట్టుముట్టిన 200 మంది పోలీసులు

Cyber Security Bureau: దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో మెగా ఆపరేషన్.. 81 మంది అరెస్ట్

Big Stories

×