AP 10th Exams Schedule 2025: ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 2025, పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసినట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. విద్యార్థులు పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైనందున, బాగా చదివి ఉన్నత మార్కులు సాధించాలని లోకేష్ ఆకాంక్షించారు.
ఏపీలోని అన్ని పాఠశాలల్లో పెద్ద పండుగ పేరిట ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో గల పరీక్షల భయాన్ని పోగొట్టడం ప్రభుత్వ లక్ష్యం కాగా, ఆ మేరకు విద్యార్థులను చైతన్య పరిచే కార్యక్రమాలను సైతం నిర్వహించారు. కాగా ఇప్పటికే ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో గల విద్యార్థులకు ప్రత్యేక స్టడీ అవర్స్ సైతం నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు సైతం విద్యార్థుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఉపాధ్యాయులు వివరించారు. దీనితో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నది ప్రభుత్వ ధ్యేయం.
అలాగే ప్రవేట్ పాఠశాలల్లో కూడా విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. అయితే ఈ సారి ప్రభుత్వం విడుదల చేసిన పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ లో కీలక మార్పును మనం గమనించవచ్చు.
Also Read: AP Intermediate Exams Schedule: ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..
ప్రతి పరీక్షకు ఒకటి లేదా, రెండు రోజుల కాల వ్యవధి ఉండడం విశేషం. దీనితో పరీక్ష ఒత్తిడిని విద్యార్థులు అధిగమించవచ్చు. ఇక మ్యాథ్స్ పరీక్షకు అయితే ఏకంగా మూడు రోజుల గడువు ఉండడంతో విద్యార్థులు తగిన కసరత్తు చేసేందుకు సమయం అనుకూలం కానుంది. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. విద్యార్థుల్లో పరీక్షలపై గల ఆందోళనను తొలగించేందుకు పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ తయారు చేసినట్లు, ఈ విషయాన్ని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు గమనించాలని లోకేష్ కోరారు.
మార్చి 17వ తేదీ నుండి ప్రారంభమయ్యే పరీక్షలు, మార్చి 31వ తేదీతో ముగియనున్నాయి. మార్చి 17న తెలుగు, 19న హిందీ, 21న ఇంగ్లీష్, 24 లెక్కలు, 26 ఫిజికల్ సైన్స్, 28 బయోలాజికల్ సైన్స్, 31 సోషియల్ సబ్జెక్టుల పరీక్షలను ఆయా తేదీలలో నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుండి 12.45 నిమిషాల పాటు పరీక్ష సమయం ఉంటుందని, ఈ విషయాన్ని విద్యార్థులు సైతం గమనించాలని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
ప్రభుత్వం విడుదల చేసిన పది పరీక్షల షెడ్యూల్ ఇదే: