Hong Kong Sixes 2025: హాంగ్‌కాంగ్ సిక్సెస్ 2025 టోర్నమెంట్ ( Hong Kong Sixes 2025) విజేతగా పాకిస్తాన్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ ఫైనల్స్ లో కువైట్ లాంటి పసికూట జట్టును చిత్తు చేసి, ఛాంపియన్ గా నిలిచింది పాకిస్తాన్. ఈ విజయంతో మొత్తం 6 సార్లు టైటిల్ గెలిచిన జట్టుగా పాకిస్తాన్ చరిత్ర సృష్టించింది. అయితే ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత అబ్బాస్ అఫ్రిది ( Abbas Afridi ), టైటిల్ అందుకున్నారు. ఆ తర్వాత అక్కడే ఉన్న లేడీ యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ విజయంపై అబ్బాస్ ఆఫ్రిది అభిప్రాయాలను తెలుసుకున్నారు యాంకర్. అయితే ఇంగ్లీష్ రాని అబ్బాస్ అఫ్రిది, ఓ ట్రాన్స్ లేటర్‌ను కూడా పక్కన పెట్టుకొని సమాధానమిచ్చారు. ఇక్కడే ట్రాన్స్ లేటర్ చెప్పిన మాటలు వైరల్ గా మారాయి. అతనికి కూడా సరిగ్గా ఇంగ్లీష్ రానట్టుంది. యాంకర్ అడిగిన ప్రశ్నకు కాకుండా ఇతర ఆన్సర్లు చెప్పి అడ్డంగా దొరికిపోయాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. దీంతో పాకిస్తాన్ పరువు మరోసారి పోయిందని ఇండియన్స్ రెచ్చిపోతున్నారు.
పాకిస్తాన్ దేశంలో చాలా మంది హిందీ మాట్లాడతారన్న సంగతి తెలిసిందే. అక్కడి క్రికెటర్లు కూడా హిందీలోనే పోస్ట్ మాచ్ ప్రెసెంటేషన్ లో ప్రసంగిస్తారు. వాళ్లకు ఎక్కువగా ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ ( Pakistan English) రాకపోయినా ట్రాన్స్ లేటర్లను పెట్టుకొని, కథ గడిపేస్తారు. ఇందులో భాగంగానే పాకిస్తాన్ కెప్టెన్సీ అబ్బాస్ అఫ్రీది కూడా ఓ ట్రాన్స్ లేటర్ ను పెట్టుకుని, సదరు యాంకర్ ఎరిన్ హాలండ (Erin Holland) అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ సీన్ రివర్స్ అయింది. యాంకర్ అడిగిన ప్రశ్నలకు అబ్బాస్ అఫ్రిది ( Abbas Afridi ) హిందీలో సమాధానం ఇచ్చాడు. కానీ అబ్బాస్ అఫ్రిది చెప్పిన సమాధానాలను ఇంగ్లీష్ లో చెప్పడంలో విఫలం అయ్యాడు ట్రాన్స్ లేటర్. నోటికి ఏది వస్తే అదే వాగేశాడు. దీంతో అక్కడే ఉన్న యాంకర్ కూడా షాక్ అయింది. అబ్బాస్ అఫ్రిది ఏం చెప్పాడు, వీడు ఏం చెబుతున్నాడో అన్న రేంజ్ లో ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చి, నవ్వేసింది యాంకర్. ఈ వీడియో వైరల్ గా మారింది. దీంతో పాకిస్తాన్ పరువు తీస్తున్నారు ఇండియన్స్ ఫ్యాన్స్.
ఇది ఇలా ఉండగా హాంగ్‌కాంగ్ సిక్సెస్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆరు ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 135 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కువైట్ దారుణంగా విఫలమైంది. 5.1 ఓవర్లకే 92 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. దీంతో 43 పరుగుల తేడాతో ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించి, పాకిస్తాన్ ఆరవసారి ఛాంపియన్ అయింది.
Also Read: IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్, ఐపీఎల్ 2026 రిటెన్షన్ ఎప్పుడంటే?
Just listen to the translator 😂
Aur inko Kashmir chahiye 🇵🇰😭😂😂 pic.twitter.com/jFGybzzae0
— Wahida 🇦🇫 (@RealWahidaAFG) November 9, 2025