BigTV English

Suriya 46: మలయాళ స్టార్ డైరెక్టర్ తో సూర్య.. ?

Suriya 46: మలయాళ స్టార్ డైరెక్టర్ తో సూర్య.. ?

Suriya 46: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. ప్రస్తుతం ఓకే భారీ విజయం కోసం కష్టపడుతున్నాడు.  అదేంటి.. ఇప్పటివరకు సూర్య ప్లాప్స్ లేడు కదా అనుకుంటే.. గత కొన్నేళ్లుగా సూర్య సినిమాలన్నీ ఓటీటీలోనే రిలీజ్ అవుతూ వచ్చాయి. ఇక ఈ మధ్యనే కంగువా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టర్ శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకుంది. రెండు పార్ట్స్ గా తెరకెక్కుతుందని డైరెక్టర్ మొదట నుంచి చెప్పుకొచ్చారు. కానీ, మొదటి భాగం పరాజయాన్ని అందుకోవడంతో రెండో పార్ట్ ఉంటుందా.. ? లేదా.. ? అనేది సందిగ్దత అందరిలో ఉంది.


మొదటి నుంచి కూడా ఈ సినిమాపై  అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. సూర్య కూడా కంగువ కోసం చాలా కష్టపడ్డాడు. పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ అవుతుండడంతో తెలుగులో కూడా ఎంతో బాగా ప్రమోషన్స్ చేసాడు. అంతేకాకుండా కంగువ నిర్మాత జ్ఞానవేల్ రాజా.. తమ సినిమా  రూ. 2 వేల కోట్లు వసూలు చేస్తుంది అని చెప్పడంతో.. అబ్బో ఇంకేముంది.. కథ సూపర్ అనుకోని వెళ్లినవారికి నిరాశే మిగిలింది. ముఖ్యంగా సూర్యతో క్రింజ్ పనులు చేయించినందుకు శివపై ట్రోలింగ్ కూడా చేశారు.

Balakrishna Akhanda 2: రిలీజ్ డేట్ లాక్.. పోస్టర్ తోనే గూస్ బంప్స్..!


ఇక ఈ సినిమా తరువాత  సూర్య చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే వాడీ వసూల్ ఒకటి ఉంది. డైరెక్టర్ బాలతో ఒక సినిమా సూర్య మొదలుపెట్టాడు. కానీ, మధ్యలోనే ఆ సినిమా ఆగిపోయింది. ఇక ఇది కాకుండా మరో రెండు సినిమాలు లైనప్ లో ఉన్నాయి. తాజాగా మరో సినిమాకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళ స్టార్ డైరెక్టర్ అమల్ నీరద్  గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. 

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి హీరోగా నటించిన బ్లాక్ సినిమాతో అమల్ నీరద్ డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. ఇప్పటివరకు దాదాపు 15 సినిమాలు తెరకెక్కించాడు. ముఖ్యంగా ఫహాద్  ఫాజిల్ నటించిన ట్రాన్స్ సినిమా  తెలుగులో కూడా మంచి హిట్ ను అందుకుంది. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ అమల్. అంతేకాకుండా మమ్ముట్టి నటించిన భీష్మ పర్వం కు డైరెక్టర్ కూడా అమలే. ఇక ప్రస్తుతం అమల్ ..  లక్కీ ఛాన్స్ ను పట్టేశాడు. 

Manchu Family Issue: మంచు వివాదంలో దూకుడు పెంచిన పోలీసులు.. విష్ణు అనుచరుడి అరెస్ట్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను డైరెక్ట్ చేసే ఛాన్స్ ను మలయాళ స్టార్ డైరెక్టర్ అమల్ నీరద్ అందుకున్నాడు.  సూర్య 46 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అమల్ నీరద్ దర్శకత్వం వహిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  కేవలం తమిళ్, మలయాళ భాషల్లో మాత్రమే ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. సినిమా మొత్తాన్ని 40 రోజుల్లోనే ఫినిష్ చేయాలనీ చూస్తున్నారట.

కథ బాగా నచ్చడంతో సూర్య మిగతా సినిమాలను పక్కన పెట్టి..  ఈ సినిమానే మొదలుపెట్టనున్నాడట. త్వరలోనే ఈ సినిమాకు  సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. వీరిద్దరి కాంబో వస్తుంది అని తెలియడంతో ఫ్యాన్స్ సినిమాపై అంచనాలను పెంచేసుకున్నారు. ఇలాంటి ఒక కాంబో సెట్ అవుతుందని ఎవరు ఊహించలేదు కాబట్టి.. ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా పట్టాలెక్కుతుందా.. ?  అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×