Gold Rate Increased: దేవుడా.. బంగారం ధరలు మళ్లీ పెరిగిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు తగ్గిన బంగారం ధరలు మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం కార్తీక మాసం శుభకార్యాలు, పెళ్లిళ్లు కారణం చేత బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో నిన్నమొన్నటి వరకు సంతోషించిన పసిడి ప్రియులు ప్రస్తుతం అయ్యో బంగారం మళ్లీ పెరిగాయి అని ఆందోళన చెందుతున్నారు. నేటి బంగారం ధరలు పరిశీలించగా..
నేటి బంగారం ధరలు ఇలా..
నిన్న మొన్నటి వరకు బంగారం ధర తగ్గుతది అని ఆశలు కల్పించిన ధరలు ఇప్పుడు మళ్లీ అందలం ఎక్కుతున్నాయి. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,020 కాగా.. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,220 వద్ద ఉంది. అలాగే శనివారం 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.1,11,850 ఉండగా.. నేడు సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,950 వద్ద పలుకుతోంది. నేడు 10 గ్రాముల బంగారం పై రూ.1,200 పెరిగింది. ..
పగబట్టిన పసిడి ధరలు..
బంగారం ధరలు పగబట్టినట్టుగా మళ్లీ పెరిగిపోతున్నాయి. బంగారం ధరలు తగ్గుతాయి.. లక్ష వరకు వస్తది ధర అని టాక్ వినిపించింది.. కానీ నిపుణులు చెప్పినట్టుగా మళ్ళీ బంగారం ధరలు లక్ష ఐభై వేలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పసిడి ప్రియులు సంతోషం మున్నాళ్ల ముచ్చటే అన్నట్లుగా మారింది. మధ్య తరగతి కుటుంబాలు కూడా బంగారం తగ్గితే కొనచ్చు అని సంతోష పడ్డారు కానీ, ఆ ఆశ ఎంతో కాలం లేకుండా పోయింది. ఇప్పుడు ముందు ముందు ఇంకా బంగారం తగ్గుతదా.. లేదంటే ఇలానే పెరుగుతదా అనేది అందరి ప్రశ్న..
రాష్ట్రంలో బంగారు ధరలు..
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,23,220 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,12,950 వద్ద ఉంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,220 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,12,950 వద్ద పలుకుతోంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,220 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,12,950 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,370 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,13,100 వద్ద ఉంది.
Also Read: బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు హార్ట్ ఎటాక్.. తర్వాత ఏం జరిగిందంటే..
నేటి సిల్వర్ ధరలు ఇలా..
బంగారం ధరలతో పాటు సిల్వర్ ధరలు కూడా నేడు భారీగా పెరిగాయి. శనివారం కేజీ సిల్వర్ ధర రూ. 1,65,000 కాగా.. నేడు సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,67,000 వద్ద పలుకుతోంది. నేడు కేజీ సిల్వర్ పై రూ.2,000 పెరిగింది.. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 1,55,000 వద్ద కొనసాగుతోంది.