Roshan Meka: విలన్ గా కెరీర్ ను మొదలుపెట్టి ఫ్యామిలీ హీరోగా మారి.. మహిళా అభిమానులను ఎక్కువ సంపాదించుకున్న హీరో శ్రీకాంత్. ఇక ప్రస్తుతం హీరోగా కాకుండా సపోర్టివ్ రోల్స్, విలన్ రోల్స్ లో నటిస్తూ బిజీగా మారాడు. హీరోయిన్ ఊహను ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీకాంత్ కు ఇద్దరు కుమారులు. ఒక కుమార్తె. శ్రీకాంత్ పెద్ద కొడుకు రోషన్ మేక.. నిర్మల కాన్వెంట్ సినిమాతో బాలనటుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. తండ్రి అందం, తల్లి కళ్లు.. వెరసి శ్రీకాంత్ – ఊహ నుంచి నటనను పుణికిపుచ్చుకున్న రోషన్ పెళ్లి సందD సినిమాతో తెలుగుతెరకు హీరోగా పరిచయమయ్యాడు.
సినిమాలో సాంగ్స్, డ్యాన్స్, నటనతో అదరగొట్టిన ఈ కుర్ర హీరో.. విజయాన్ని దక్కించుకోలేకపోయాడు. అయినా సరే ఏమాత్రం కుంగిపోకుండా అవకాశాలను రాబట్టుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. పెళ్లి సందD తరువాత రోషన్.. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న వృషభలో ఛాన్స్ పట్టేశాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్ కొడుకుగా రోషన్ నటించాడు. తండ్రీకొడుకుల మధ్య ఈగో క్లాష్ నే ఈ సినిమా. దాన్నే పీరియాడికల్ నేపథ్యంలో తెరకెక్కించడం జరిగింది. అయితే ఈ సినిమా నుంచి రోషన్ తప్పుకున్నాడు. దానికి కారణం ఏంటి అనేది తెలియదు కానీ, ఇన్నేళ్లు ఆ సినిమా కోసం కష్టపడి.. ఇప్పుడు సడెన్ గా బయటకు రావడం అంటే ఎవరికైనా బాధ అనే చెప్పొచ్చు.
అయితే మోహన్ లాల్ సినిమా నుంచి బయటకు వచ్చి రోషన్ మంచి పనే చేశాడని అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. మోహన్ లాల్ సినిమాలో కొడుకుగా కొన్ని సీన్స్ కు మాత్రమే పరిమితమయితే.. ఆ తరువాత నుంచి అతనికి ఏవ్ రోల్స్ వస్తాయి. హీరోగా ఎదిగే సమయంలో ఇలాంటి రోల్స్ చేయడం అతని కెరీర్ కు అంత మంచిది కాదు. ఇక సినిమా హిట్ అయితే ఓకే.. అవ్వకపోతే అదొక నెగిటివ్ ట్రోల్ కింద మిగిలిపోతుంది. ఇలాంటి రిస్క్ తీసుకోవడం కూడా అతని కెరీర్ కు మంచిది కాదు.
ఇక ప్రస్తుతం రోషన్ హీరోగా ఛాంపియన్ అనే సినిమా చేస్తున్నాడు. గత మూడేళ్ళుగా ఈ సినిమాపైనే రోషన్ కష్టపడుతున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా కాబట్టి.. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్ కూడా మంచి హైప్ తెచ్చుకుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 25 న రిలీజ్ కానుంది. అయితే విచిత్రం ఏంటంటే వృషభ కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది హిట్ గా నిలుస్తుంది. వృషభ వదులుకొని రోషన్ మంచి పనే చేశాడా.. ?లేదా .. ? అనేది కూడా ఆరోజే తెలుస్తోంది.