SSMB 29 :ఈ మధ్యకాలంలో దర్శకులు సినిమాలు చేస్తున్నారు అంటే ప్రతి సినిమా విషయంలో తమ ఐడెంటిటీ కనిపించేలా ఆ చిత్రాలను తెరకెక్కిస్తూ ఉంటారు. మరికొంతమంది తమ సినిమాలలో అన్ని పువ్వులు , పండ్లు వాడేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అలాంటి వారిలో రాజమౌళి (Rajamouli )కూడా ఒకరు. ఇప్పటివరకు ఈయన చేసిన సినిమాలలో ఒక్కో సినిమాలో ఒక్కో జంతువును ఉపయోగించిన ఈయన జంతువులకు రాజు అయిన మృగరాజును మాత్రం ఇంతకాలం ఆయన కోసమే దాచుంచారు అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
విషయంలోకి వెళ్తే.. రాఘవేందర్రావు పర్యవేక్షణలో శాంతినివాసం సీరియల్ ఎపిసోడ్ కి డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టిన రాజమౌళి.. ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా చేసి దర్శకుడిగా తొలి అడుగులు వేశారు ఆ తర్వాత సింహాద్రి, సై, ఈగ, మగధీర, విక్రమార్కుడు, యమదొంగ, బాహుబలి 1&2, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన రాజమౌళి.. ఇప్పుడు మహేష్ బాబుతో ఎస్.ఎస్.ఎం.బి 29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో సింహాన్ని హైలెట్ చేస్తూ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇన్ని రోజులు తన సినిమాలలో అన్ని జంతువులను వాడేసిన రాజమౌళి .. మహేష్ బాబు కోసమే సింహాన్ని దాచుంచడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇకపోతే రాజమౌళి దర్శకత్వం వహించిన గత చిత్రాలన్నీ గమనిస్తే.. అన్ని సినిమాలలో అన్ని జంతువులను ఆయన వాడేశారు. పైగా పులి, చిరుత పులితో పాటూ ఆర్ఆర్ఆర్ సినిమా ఇంటర్వెల్ భాగంలో అన్ని జంతువులు ఆయన వాడారు ఒక సింహం తప్ప.. ఇన్ని సంవత్సరాలుగా సింహాన్ని ప్రత్యేకంగా దాచుంచడానికి కారణం మహేష్ బాబు అని.. మహేష్ బాబుని సింహంతో పోలుస్తూ ఆయన కోసమే రిజర్వ్ చేసి పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే ఎస్ఎస్ఎంబి29 మూవీ ఎప్పుడైతే మొదలైందో అప్పటినుంచి సింహం ఎక్కువగా హైలెట్ అవుతున్న విషయం తెలిసిందే. మొత్తానికైతే జక్కన్న మహేష్ బాబును సింహంతో పోలుస్తూ తన సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా 2027లో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ALSO READ:Bigg Boss 9 Promo: ఇదెక్కడి గోలరా.. ఆమె మాట వింటారంటున్న రీతూ!
ఎస్ ఎస్ ఎం బి 29 సినిమా విషయానికి వస్తే.. శ్రీ దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై కే.ఎల్.నారాయణ సుమారుగా 1200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతుందని సమాచారం. మహేష్ బాబు హీరోగా, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవల ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. మరొకవైపు నవంబర్ 15న హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో గ్లోబ్ ట్రోటర్ అంటూ ఒక ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్లో గ్లింప్స్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే రేపు ప్రియాంక ఫస్ట్ లుక్ రిలీజ్ కానుండగా.. త్వరలో మహేష్ బాబు ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.