BigTV English
Advertisement

Manchu lakshmi : మా నాన్న నన్ను చీట్ చేశారు.. మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్..పచ్చి నిజాలు..?

Manchu lakshmi : మా నాన్న నన్ను చీట్ చేశారు.. మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్..పచ్చి నిజాలు..?

Manchu lakshmi : టాలీవుడ్ సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆయన ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు.. ఆయన తర్వాత వారసులుగా తన పిల్లల్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మీ ముగ్గురు కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మంచు లక్ష్మీ ప్రస్తుతం ముంబైలో సెటిల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఓ ఛానల్ కి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో భాగంగా మాట్లాడుతూ తన తండ్రి, మంచు విష్ణు దారుణంగా చీట్ చేశారని చెప్పింది. ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఆ వీడియోలో లచ్చక్క ఏం చెప్పింది? ట్రోల్స్ వచ్చే నిజాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..


మా నాన్న, విష్ణు నన్ను మోసం చేశారు..

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మంచు లక్ష్మీ గురించి అందరికీ తెలుసు.. మొదట టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరించింది. అందులో తను కనపరిచిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమె చేసిన సినిమాలన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ ఆమెకు పెద్దగా బ్రేక్ అయితే ఇవ్వలేదు. ఏదో ఒక రోజు హిట్ కొడతాను అని లచ్చక్క కొత్త సినిమాలను చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇకపోతే తాజాగా ఈమె న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ వచ్చింది. అందులో భాగంగా ఆమె తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మీరు అప్పుడు అమెరికాలో ఉన్నారు కదా ఇండియాకి ఎందుకు వచ్చేసారు అని యాంకర్ ప్రశ్నించారు.. దానికి మంచు లక్ష్మి సమాధానం చెప్పింది. నేను ఇండియాకి రాలేదు నన్ను రప్పించారు.. మంచు విష్ణు కి కొత్తగా పెళ్లయింది. అది ఇది అని నన్ను ఇక్కడికి రప్పించారు. ఆ తర్వాత ఓ షో గురించి చెప్పారు. వాళ్లు నన్ను చీట్ చేసి ఇక్కడే ఉండేలా చేశారు అని మంచు లక్ష్మీ అంటున్నారు. ఆరోజు నన్ను అలా కన్విన్స్ చేయకుండా ఉంటే ఇప్పటికే నేను అక్కడే ఉండేదాన్నేమో.. ఈ విషయంలో మాత్రం నేను వాళ్ళ మీద కాస్త కోపంగానే ఉన్నాను అని ఫన్నీగా సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఆమె అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

 అమెరికా కన్నా ఇండియానే బెస్ట్..

అంతేకాదు ఆ ఇంటర్వ్యూ లో పిల్లలు పుడితే అమెరికాలో పరిస్థితి ఎలా ఉంటుందో కూడా వివరించింది. నేను కంప్లీట్ గా ఇండియాకి రావడానికి మా ఆయన పర్మిషన్ తీసుకున్నాను. పిల్లలు కలిగే టైం కి కచ్చితంగా నేను ఇండియాలో ఉంటే బాగుంటుందని అనుకున్నాను. ఈ విషయంలో మాత్రం ఇండియా ఎన్నో రెట్లు బెటర్ అని మంచు లక్ష్మీ పొగిడేశారు. మన దేశంలో ఉన్నంత ఫ్రీడం ఆ దేశంలో ఉండనే ఉండదు. మనవాళ్లు సాంప్రదాయాల ప్రకారం బాలింతలు ఎలాంటి నియమాలు పాటించాలి? ఎలా ఉండాలి అని చెబుతారు. అక్కడ మాత్రం పిల్లలు కలిగిన వెంటనే ఏమాత్రం కనికరం లేకుండా మళ్లీ జాబ్ లోకి జాయిన్ అవ్వాలని చెప్తారు. అలాంటి పరిస్థితులలో పిల్లల్ని పెంచడం కరెక్ట్ కాదని నేను కంప్లీట్ గా ఇండియాకి వచ్చేసాను. నన్ను ఇండియాకి బలవంతంగా రప్పించారు ఆ ఒక్క విషయంలో మాత్రం నేను మా నాన్న, విష్ణు మీరు చాలా కోపంగా ఉంటాను అని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.


Aslo Read :పవన్ సాయి కాపురంలో చిచ్చు పెట్టింది ఆమెనే.. ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం..

మంచు లక్ష్మీ సినిమాల విషయానికొస్తే.. ఈమధ్య ఈమె తెలుగులో సినిమాలు చేయలేదు కానీ.. బాలీవుడ్ లో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అందుకే ఆమె హైదరాబాద్ నుంచి ముంబైకి మకాం మార్చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ముంబైకి షిఫ్ట్ అయిన తర్వాత ఆమె గ్లామర్ డోస్ కూడా పెంచేసింది. హాట్ లుక్ లోని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యూత్ ని ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. ఈ అమ్మడు ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు..

Related News

Actor Death: ఆర్థిక సహాయం కోసం ఎదురుచూసి నటుడు మృతి.. ఏమైందంటే?

Film industry: హీరోయిన్లతో నటుడు రాసలీలలు… ఎవరితో నడిపించాడో తెలుసు అంటున్న భార్య

Gatha Vibhavam Trailer: టైమ్ ట్రావెల్ ప్రేమ కథ.. భలే విచిత్రంగా ఉందే

SSMB 29 : మహేష్ సినిమాలో సింహం… ఇంతలా దాచుంచడం వెనుక పెద్ద స్టోరీ ఉందే!

Roshan Meka: మోహన్ లాల్ సినిమా నుంచి తప్పుకొని శ్రీకాంత్ కొడుకు తప్పు చేశాడా.. ?

ENE2: ఈ నగరానికి ఏమైంది 2 నుంచి తప్పుకున్న సురేష్ ప్రొడక్షన్స్..?

Vijay Deverakonda: రష్మిక లక్ విజయ్ కి కలిసొచ్చేలా ఉందే.. అది కూడా జరిగితే తిరుగుండదు..

Big Stories

×