AI Browser Risk| ఇటీవలే చాట్‌జిపిటి మాతృక సంస్థ ఓపెన్ ఏఐ అట్లాస్ అనే ఏఐ (కృత్రిమ మేధ) బ్రౌజర్‌ని లాంచ్ చేసింది. అలాగే పర్‌ప్లెక్సిటీ ఏఐ కూడా కామెట్ అనే ఏఐ బ్రౌజర్ ని లాంచ్ చేయగా.. గూగుల్ అంతకుముందే గూగుల్ సెర్చ్ ని ఏఐ మోడ్ లో ఉపయోగించడానికి జెమెని ఏఐని ఇంటిగ్రేట్ చేసేసింది. వీటిలోని ఫీచర్లతో బ్రౌజింగ్ వేగంగా, చాలా సులభంగా చేయవచ్చని ఆ సంస్థలు ప్రకటించాయి. ఇవి ఇంటర్నెట్‌లో సమాచారం వెతికి, యూజర్లు అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇవ్వగలవు. కానీ ఈ బ్రౌజర్లు మీ వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లకు బహిర్గతం చేసే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో యూజర్ల బ్యాంకు ఖాతా హ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు.
ఓపెన్‌ఏఐ, పెర్‌ప్లెక్సిటీ వంటి కంపెనీలు ఈ బ్రౌజర్లను తయారు చేస్తున్నాయి. ఇవి ఏఐ అసిస్టెంట్‌లా పనిచేస్తాయి. మీరు అడిగిన ప్రశ్నకు ఇంటర్నెట్‌ను స్కాన్ చేసి సమాధానం ఇస్తాయి. కానీ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ వంటి సాధారణ బ్రౌజర్లతో పోలిస్తే ఇవి సురక్షితంగా లేవనేది నిపుణుల వాదన.
హ్యాకర్లు ఒక వెబ్‌సైట్‌లో రహస్య కమాండ్స్ జోడిస్తారు. ఏఐ బ్రౌజర్ ఆ పేజీని చూసినప్పుడు ఆ కమాండ్స్‌ని అనుసరిస్తుంది. మీరు ఏమీ చేయకుండానే ఏఐ మీ డేటాను హ్యాకర్లకు పంపుతుంది.
ఏఐ బ్రౌజర్‌కు మీ ఫైల్స్, బ్యాంకు లాగిన్ వివరాలు అందుబాటులో ఉంటాయి. వెబ్ సైట్ లో రహస్యంగా దాచి ఉన్న కమాండ్స్ వచ్చినప్పుడు ఏఐ అవి హ్యాకర్లకు పంపుతుంది. మీరు రహస్యంగా ఉంచిన సమాచారం బయటపడుతుంది.
గూగుల్ క్రోమ్‌లోనూ లోపాలు ఉంటాయి, కానీ కంపెనీలు త్వరగా అప్‌డేట్స్ ఇస్తాయి. దీంతో హ్యాకర్లు అంత ఈజీగా మీ డేటాని దొంగలిచలేదరు. ఏఐ బ్రౌజర్లలో లోపం ఏఐలోనే ఉంటుంది. దాన్ని సరిచేయడం కష్టం, దాడులు ఆపడం కూడా కష్టం.
హ్యాకర్లు ముందుగా బ్యాంకు అకౌంట్‌నే టార్గెట్ చేస్తారు. ఏఐ సహాయంతో లాగిన్ వివరాలు దొంగిలించి, మీ అకౌంట్ నుంచి డబ్బు ఖాళీ చేస్తారు. మీకు తెలిసేసరికే అకౌంట్ ఖాళీ అయిపోతుంది.
కంపెనీలు ఏం చేస్తున్నాయి?
ఏఐ బ్రౌజర్ కంపెనీలు కొత్త సెక్యూరిటీ పద్ధతులు అమలు చేస్తున్నాయి. కానీ ఇవి పూర్తి సురక్షితం కావు. మీ జాగ్రత్త మీ చేతుల్లోనే ఉంది.
రానున్న సంవత్సరాల్లో సెక్యూరిటీ మెరుగవుతుంది. కానీ పూర్తి సురక్షితం అయ్యే వరకు వేచి ఉండండి. కొత్త టెక్నాలజీ కోసం రిస్క్ తీసుకోవద్దు.
ఏఐ బ్రౌజర్లు సౌకర్యవంతంగా ఉన్నా, ప్రమాదాలు ఎక్కువ. మీ బ్యాంకు అకౌంట్, వ్యక్తిగత సమాచారం రక్షణ కోసం నిర్లక్ష్యంగా బ్రౌజింగ్ చేయవద్దు. వీలైనంతవరకు సాధారణ బ్రౌజర్లు ఉపయోగించి , బేసిక్ సెక్యూరిటీ నియమాలు పాటించండి.
Also Read: ప్రపంచంలోని అత్యంత సురక్షిత స్మార్ట్‌ఫోన్‌లు.. వీటిని హ్యాక్ చేయడం అసాధ్యమే?