BigTV English

Kiran Abbavaram- Rahasya Gorak Wedding: రాజావారు- రాణిగారు.. ఈరోజే ఒక్కటయ్యారు

Kiran Abbavaram- Rahasya Gorak Wedding: రాజావారు- రాణిగారు.. ఈరోజే ఒక్కటయ్యారు

Kiran Abbavaram- Rahasya Gorak Wedding: టాలీవుడ్  యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఎట్టకేలకు ఒక ఇంటివాడు అయ్యాడు. తాను ప్రేమించిన  రహస్య గోరఖ్ ను ఇరు వర్గాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.


 


రాజావారు- రాణిగారు అనే సినిమాతో కిరణ్  ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అదే సినిమాలో హీరోయిన్ గా నటించిన రహస్య గోరఖ్  తో ఎన్నో ఏళ్లుగా  ప్రేమాయణం నడుపుతూ వచ్చాడు. చాలాసార్లు ఈ జంట ఇన్ డైరెక్ట్ హింట్స్ ఇస్తూ వచ్చారు. అప్పుడే అభిమానులు.. వీరి మధ్య లవ్ స్టోరీ నడుస్తుందని గమనించారు.

ఇక  కిరణ్ అబ్బవరం గృహ ప్రవేశ వేడుకలో ఒక సాధారణ యువతీలా రహస్య  పూలు కడుతూ.. ఇంటి పనులు చేస్తూ కనిపించడంతో.. వీరు త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఇక ఆ వార్తలను నిజం చేస్తూ కిరణ్ .. మార్చ్ 14 న  రహస్యతో  నిశ్చితార్థం చేసుకున్నాడు.

ఇక దాదాపు నాలుగు నెలల తరువాత కిరణ్ – రహస్య వివాహం నిన్న కర్ణాటకలోని కూర్గ్ లోని ఒక రిసార్ట్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఎక్కువమందిని  పిలవకుండా అత్యంత సన్నిహితుల మధ్య ఈ జంట ఒక్కటయ్యారు.

 

తాజాగా  కిరణ్ అబ్బవరం.. తన పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. పెళ్ళిలోని అద్భుతమైన ఫోటోలను షేర్ చేస్తూ.. ఎట్టకేలకు ఒక్కటయ్యాం.. మీ అందరి ఆశీస్సులు కావాలని ప్రేక్షకులను  కోరాడు. ఇక ఈ ఫోటోలకు అభిమానులు.. చల్లగా ఉండండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

 

పెళ్లి దుస్తుల్లో జంట చూడముచ్చటగా కనిపించారు. గోల్డ్ కలర్ చీరలో రహస్య.. అదే గోల్డ్ కలర్ షేర్వాణీలో కిరణ్ ఎంతో అందంగా కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

 

పెళ్లి తరువాత ఈ జంట రిస్పెషన్ కూడా చేయనునున్నారట. టాలీవుడ్ మొత్తం ఈ రిసెప్షన్ లో పాల్గొంటారని సమాచారం. ఇక పెళ్లి తరువాత రహస్య సినిమాలు చేయదు అని టాక్ నడుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం కిరణ్ అబ్బవరం క అనే సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో కిరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Ritika Nayak: చీరలో రితికా సొగసులు.. మిరాయ్ సక్సెస్ మీట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన భామ

Samantha: చాలా రోజుల తర్వాత సమంత ఇలా.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?

Alia Bhatt: మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌.. బోల్డ్‌ లుక్‌లో షాకిచ్చిన అలియా.. ఇలా ఉందేంటి..!

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Big Stories

×