BigTV English

Chanakya Niti: సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం చాణక్యుడు చెప్పిన సూత్రాలు !

Chanakya Niti: సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం చాణక్యుడు చెప్పిన సూత్రాలు !

Chanakya Niti: చాణక్యుడు గొప్ప పండితుడు. చాణక్య నీతిలో మానవ జీవితానికి సంబంధించిన అనేక సలహాలను ఇచ్చాడు. వాటిని అనుసరిస్తే నేటి జీవితంలో కూడా ఆనందం, విజయాలను పొందవచ్చు. చాణక్యుడి సూత్రాలను పాటించిన వారు, వారి జీవితంలో కష్టాలను సులభంగా ఎదుర్కుంటారని, ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటారని చెబుతుంటారు. అందుకే అందుకే చాణక్యుడి సూత్రాలను నేటి సమాజంలోను పాటిస్తూ ఉంటారు.


చాణుక్యుడి జీవిత సూత్రాలు ఇప్పటికీ పాటించే వారు చాలా మంది ఉన్నారు. చాణక్యుడు చెప్పిన సూత్రాలను పాటిస్తే జీవితంలో ఈజీగా విజయం సాధించవచ్చు. బంధాలు కూడా ఆనందంగా ఉంటాయి. చాణక్యుడు చెప్పిన సూత్రాలు ప్రతి ఒక్కరి జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. వీటిని పాటిస్తే సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. అందమైన వివాహ జీవితం గురించి చాణక్యుడు అనేక విషయాలను తెలిపాడు. భార్యాభర్తల బంధాన్ని బలోపేతం చేయడానికి ఐదు సూత్రాలను అనుసరించాలని తెలిపాడు. వీటిని పాటిస్తే వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండవచ్చు.

1. పరస్పర గౌరవం:
ఏ బంధమైనా పరస్పర గౌరవం ఉంటేనే ఎక్కువ కాలం నిలబడుతుంది. సంతోషకరమైన వైవాహిక జీవితంలో పరస్పర గౌరవానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. భార్యా భర్తలిద్దరూ పరస్పరం పూర్తిగా గౌరవాన్ని కలిగి ఉండాలి. ఒకరినొకరు గౌరవించడం ద్వారా సంబంధంలో ప్రేమ బాగా పెరుగుతుంది. అప్పుడు ఇద్దరూ జీవితంలో ఆనందంగా కూడా ఉంటారు. చాలా మంది ఇతరుల ముందు తమ భాగస్వామిని అగౌరవపరుస్తారు. ఇది సంబంధాన్ని విచ్ఛిన్నం చేసే విషయాల్లో మొదటి వరుసలో ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండటం కోసం ఒకరినొకరు గౌరవించుకోవడం అవసరం.


2. ప్రేమ చాలా కీలకం:
చాణక్యుడి ప్రకారం బలమైన సంబంధాలను ఏర్పరుచుకోవాలి. వైవాహిక బంధంలో ప్రేమ అత్యంత కీలకమైంది. ఇద్దరి మధ్య ప్రేమ బలహీనపడడం ప్రారంభమైన సందర్భంలో కూడా సంబంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంటుంది. భార్య భర్తల ప్రేమ అఖండంగా ఉండాలి. వైవాహిక జీవితంలో సంతోషం, శాంతి శాశ్వతంగా ఉండేలా జాగ్రత్త పడాలి. ఎప్పుడు ఒకరి మీద ఒకరు ప్రేమను చూపిస్తూ ఉండాలి. అంతే కంటే ముఖ్యంగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.

3. బంధంలో నిజాయితీ:
సంబంధాలలో నిజాయితీ అనేది చాలా ముఖ్యం. ప్రతి విషయం గురించి ఒకరితో ఒకరు బహిరంగంగా మాట్లాడుకోవాలి. దేని గురించి కూడా అబద్ధం కూడా చెప్పకూడదు.భార్యాభర్తలిద్దరూ దీనికి కట్టుబడి ఉండటం అవసరం. చిన్న చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలు సృష్టించకపోతే బంధం చెడిపోదు. అనుమానం, అపనమ్మకం బంధాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. అందుకే ఒకరిపై ఒకరు పూర్తి నమ్మకంతో ఉండడం మంచిది. బంధానికి మానసిక సంతృప్తి అవసరం.

4. మానసిక సంతృప్తి:
ప్రతి మనిషి తన చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి పొందాలనుకునేది మానసిక సంతృప్తి మాత్రమే. అంతేకాకుండా శాంతి, ప్రేమ భావం కూడా కోరుకుంటారు, వైవాహిక సంబంధాలలో ప్రేమ, భావోద్వేగాలు, శారీరక ఆనందాన్ని ఎల్లప్పుడూ పరస్పరం పంచుకుంటూ ఉండాలి. సంతోషకరమైన, ప్రశాంతమైన జీవితానికి ఇది దారితీస్తుంది. లేదంటే విడిపోవడానికి ఇదే మొదటి అడుగు అవుతుంది.

Also Read: జన్మాష్టమి శుభ ముహూర్తం, పూజా విధానం వివరాలు ఇవే..

5. భద్రతా భావం:
చాణక్యుడి ప్రకారం వైవాహిక జీవితంలో భద్రతా భావం చాలా అవసరం. భర్త తన భార్యను ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. భద్రతా భావం ఇరువురి నమ్మకాన్ని పెంచుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా తనవాడు రక్షిస్తాడని భార్యకు నమ్మకం కలిగించాలి. భార్యకు ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా భర్త నమ్మకం కలిగించాలి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Big Stories

×