BigTV English

Kiran-Rahasya: కిరణ్ అబ్బవరం పెళ్లి ఫోటోలు వచ్చేశాయి.. చూశారా.. ?

Kiran-Rahasya: కిరణ్ అబ్బవరం పెళ్లి ఫోటోలు వచ్చేశాయి.. చూశారా.. ?

Kiran-Rahasya: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈ మధ్యనే ఒక ఇంటివాడైన విషయం తెల్సిందే. తన మొదటి సినిమా హీరోయిన్నే ప్రేమించి.. పెద్దలను ఒప్పించి భార్యగా మార్చుకున్నాడు.


 


రాజావారు రాణిగారు సినిమాతో కిరణ్.. టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. అదే సినిమాతో రహస్య గోరఖ్ కూడా  హీరోయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే ఈ జంట మంచి విజయాన్ని అందుకున్నారు.

 

రాజావారు రాణిగారు ఏదో రోజు ఒక్కటవ్వుతారు అని ఏ ముహూర్తాన ఆ సినిమాలో సాంగ్ ఉందో కానీ..  ఆ సాంగ్ ను కిరణ్ – రహస్య నిజం చేశారు. ఆ సినిమా సెట్ లోనే ఈ జంట మొదటి  పరిచయం, ప్రేమ మొదలయ్యాయి.

 

దాదాపు ఆరేళ్లు వీరు డేటింగ్ లో ఉండి.. ఈ నెల 22 న కూర్గ్ లో వీరి వివాహం అత్యంత  సన్నిహితుల మధ్య ఘనంగా  జరిగింది. ఇక పెళ్ళైన రెండోరోజే కిరణ్ తన పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆశీర్వదించమని కోరాడు.

 

తాజాగా రహస్య..  తన పెళ్లి ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తూ.. తమను ఒక్కటిగా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది.

 

మా ఆనందాన్ని పంచుకున్నందుకు మరియు మా వేడుకల్లో భాగమైనందుకు మీ అందరికీ ధన్యవాదాలు.  మీ అందరి శుభాకాంక్షలు మరియు ప్రేమ.. మా ప్రత్యేక రోజును పూర్తి చేసింది. మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాము అంటూ చెప్పుకొచ్చింది.

 


 

కిరణ్- రహస్య పెళ్లి వేడుకలు మొదలైన దగ్గరనుంచి హల్దీ, సంగీత్ వేడుకలలోని అద్భుతమైన జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంది.

హల్దీ వేడుకల్లో ఈ జంట ఎంతో ఆనందంగా పాల్గొన్నట్లు కనిపిస్తుంది. ప్రేమించివారిని పెళ్ళాడడం కన్నా పెద్ద అచీవ్ మెంట్ ఏముంటుంది. ఇక ఈ వేడుకల్లో కిరణ్- రహస్య మోముల్లో అదే ఆనందం వెల్లివిరిసింది.

బంధువులు, సన్నిహితుల నడుమ  డ్యాన్స్ వేస్తూ కిరణ్ – రహస్య  తమ పెళ్లి వేడుకను ఎంతో గ్రాండ్ గా జరుపుకున్నారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. కిరణ్ – రహస్య జంటను చూసి అభిమానులు దిష్టి తగులుతుందేమో అని దిష్టి ఎమోజిస్ పెట్టుకొస్తున్నారు. ఇంకొంతమంది అందమైన  జంట అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

 

 

ఇకపోతే ప్రస్తుతం కిరణ్ అబ్బవరం క అనే సినిమాతో బిజీగా ఉన్నాడు.  రాజావారు రాణిగారు తరువాత రహస్య మరో సినిమాలో నటించలేదు. పెళ్లి తరువాత కూడా ఆమె నటించే  ఉద్దేశ్యంలో కూడా లేదని టాక్. మరి కిరణ్.. ఈ పాన్ ఇండియా సినిమాతో ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Related News

Ritika Nayak: చీరలో రితికా సొగసులు.. మిరాయ్ సక్సెస్ మీట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన భామ

Samantha: చాలా రోజుల తర్వాత సమంత ఇలా.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?

Alia Bhatt: మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌.. బోల్డ్‌ లుక్‌లో షాకిచ్చిన అలియా.. ఇలా ఉందేంటి..!

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Big Stories

×