E-Paper
Advertisement

Allu Arjun: బాలయ్య 50 ఇయర్స్ సెలబ్రేషన్స్.. అల్లు అర్జున్ కు ఆహ్వానం

Allu Arjun: బాలయ్య 50 ఇయర్స్ సెలబ్రేషన్స్.. అల్లు అర్జున్ కు ఆహ్వానం
Advertisement

Allu Arjun: నందమూరి నట సింహం నందమూరి బాలకృష్ణ.. ఇండస్ట్రీకి వచ్చి 50 వసంతాలు  పూర్తిచేసుకున్న విషయం తెల్సిందే. దీంతో తెలుగు సినీ పరిశ్రమ.. బాలకృష్ణకు ఘనంగా సత్కరించాలని నిర్ణయించుకుంది.  బాలకృష్ణ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ వేడుకలను ఒక పండగలా నిర్వహించడానికి ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో ఈ వేడుకలు  అంగరంగ వైభవంగా జరగనున్నాయి.

సినీ, రాజకీయ ప్రముఖులు  ఈ వేడుకకు కదిలిరానున్నారు. కేవలం తెలుగు మాత్రమే కాదు.. అన్ని ఇండస్ట్రీల నుంచి అతిరధమహారథులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇక ఈ వేడుకలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ  సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరుకానున్నట్లు సమాచారం. ఇక సినీ ప్రముఖులకు తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్.. ఆహ్వాన పత్రికలను అందజేయడం మొదలుపెట్టారు.

Advertisement

ఇప్పటికే  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని సినీ ఇండస్ట్రీ తరఫున ఆహ్వానించారు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హానరబుల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ , తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హానరబుల్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ , నిర్మాత కె. ఎల్. నారాయణ , నిర్మాత జెమినీ కిరణ్ , నిర్మాత , డిస్ట్రిబ్యూటర్ కొమ్మినేని వెంకటేశ్వరరావు, సీఎం చంద్రబాబును కలిసి వేడుకకు రావాలని ఆహ్వానించారు.

ఇక తాజాగా అల్లు అర్జున్  కు సైతం..  బాలకృష్ణ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ ఇన్విటేషన్ అందింది. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పెద్దలు.. అల్లు అర్జున్ ను కలిసి ఇన్విటేషన్ అందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన  ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఈవెంట్ కు అల్లు అర్జున్ వస్తాను అని చెప్పినట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే.. ఒకే స్టేజిపై పవన్ కళ్యాణ్, అర్జున్ కలవనున్నారు.

Advertisement

ప్రస్తుతం  అల్లు – మెగా కుటుంబాల మధ్య విభేదాలు  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన  అవసరం లేదు. బన్నీని మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ను అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి  ఒకే వేదికపై  కనిపిస్తే.. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా.. ? లేక ఇంకా వివాదం ఎక్కువ అవుతుందా.. ? అనేది  చూడాలి. అసలు   ఈ ఈవెంట్ కు బన్నీ వస్తాడా.. ? రాడా.. ? అనేది  తెలియాలంటే మరో వారం ఓపిక పట్టాల్సిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×