Malavika Mohanan (Source: Instagram)
Malavika Mohanan Photos: హీరోయిన్ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేరళకు చెందిన మాళవిక.. మలయాళం,తమిళ్, తెలుగులో చిత్రాల్లో నటించింది.
Malavika Mohanan (Source: Instagram)
ఇప్పటి వరకు డబ్బింగ్ చిత్రాలతోనే ఈ భామ తెలుగు ఆడియన్స్‌కి పరిచయమైంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన 'మాస్టర్' చిత్రంతో తెలుగు ఆడియన్స్‌కి దగ్గరైంది. 2021లో తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ విడుదలైంది.
Malavika Mohanan (Source: Instagram)
దీంతో ఈ భాకు టాలీవుడ్ మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత 2024లో తంగళాన్ చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రంతో బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ హిట్స్ కొట్టిన మాళవిక.. ఎట్టకేలకు నేరుగా ఓ సినిమా చేస్తోంది.
Malavika Mohanan (Source: Instagram)
ప్రభాస్ ది రాజాసాబ్‌లో ఆమె సెకండ్ హీరోయిన్గా నటిస్తుంది. ఆమెకు ఇదే తొలి తెలుగు చిత్రం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ తో బిజీగా ఉంది. మరోవైపు ఈ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. వరుసగా తన ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్స్‌ని ఆకట్టుకుంటోంది.
Malavika Mohanan (Source: Instagram)
తాజాగా మళవిక తన టేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. మల్టీకలర్ లెహెంగా చోలీలో ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకుంటోంది. ట్రెడిషినల్ లుక్‌తో మాళవిక కుర్రాళ్ల మనసులు కొల్లగొడుతోంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.