The Paradise Film: నాచురల్ స్టార్ నాని(Nani) ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రయాణం మొదలుపెట్టారు. ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలైన ఈయన ప్రయాణం హీరోగా, నిర్మాతగా కొనసాగుతూ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక నాని ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఒకవైపు హీరోగా మరోవైపు నిర్మాతగా కూడా వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఇక నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న ది ప్యారడైజ్(The Paradise) సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Sreekanth Odela) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏకంగా ఎనిమిది భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో నాని విభిన్న పాత్రలో కనిపించబోతున్నారని ఇప్పటికి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తేనే అర్థమవుతుంది.. ఎస్ఎల్వీ సినీ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇకపోతే తాజాగా చిత్ర బృందం ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ తెలియచేస్తూ ఒక పోస్టర్ విడుదల చేశారు.
ఇక ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ కోసం గత కొంతకాలంగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే అభిమానులకు ఊహించని విధంగా ఒకేరోజు రెండు బిగ్ సర్ప్రైజ్ లను ప్రకటించబోతున్నట్లు తాజాగా పోస్టర్ ద్వారా చిత్ర బృందం వెల్లడించారు. రేపు ఉదయం 10:08 గంటలకు ఒక అప్డేట్ తెలియచేయనున్నారు. అదేవిధంగా సాయంత్రం 05:04 గంటలకు మరొక అప్డేట్ తెలియచేయునున్నట్లు ఒక పోస్టర్ ద్వారా వెల్లడించారు.. ఇక ఈ పోస్టర్స్ చూసిన నాని ఫాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే రేపు విలన్ పాత్రకు సంబంధించిన బిగ్ అప్డేట్ రాబోతుందని అభిమానులు భావిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవితో నాని..
ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చి 26వ తేదీ ఏకంగా 8 భాషలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమాపై ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు.. ఇదివరకే నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో దసరా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో మరోసారి వీరి కాంబోలో ఏకంగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా తర్వాత నాని నిర్మాణంలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన కూడా వెలువడింది. ఇలా నాని హీరోగా, నిర్మాతగా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
Also Read: Actress Sudeepa: పెళ్లయిన 11 ఏళ్లకు బిడ్డకు జన్మనిచ్చిన నటి..ఖుషీ అవుతున్న ఫ్యాన్స్!