Chevella Bus Accident: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోగా పలువురుకి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతల కుటుంబాలకు రూ. 5లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషయా ప్రకటించారు.
కాగా మృతదేహాలకు పోస్టుమార్టం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతుందని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. మృతుల్లో పది మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నట్లు పేర్కొన్నారు. 19 మందిలో 13 మంది మృతులను గుర్తించారు పోలీసులు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పోస్టుమార్టం పూర్తయ్యాక ఒక్కో మృతదేహానికి ఒక్కో అధికారిని కేటాయించి పంపిస్తాం అని తెలిపారు.
ఇదిలా ఉంటే.. ఈ ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని అకాంక్షించారు. మృతులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.