Baaghi 4:ఒకప్పుడు ఓటీటీలకు పెద్దగా ప్రేక్షకాదరణ ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే కరోనా వచ్చిందో.. పైగా బయట లాక్ డౌన్ విధించడంతో బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో ఇంట్లో ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక ప్రజలందరూ కూడా ఓటీటీలపై దృష్టి పెట్టారు. అలా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చేసాయి ఓటీటీలు. భిన్న విభిన్నమైన ఫ్లాట్ ఫార్మ్స్.. అంతకుమించి వినోదాన్ని పంచుతూ.. ఫ్యామిలీ మొత్తాన్ని ఒకే చోట చేర్చి ఇష్టమైన సినిమాను చూసే అవకాశాన్ని ఈ ఓటీటీలు కల్పిస్తున్నాయి. అందుకే చాలామంది తమకు నచ్చిన ప్లాట్ ఫామ్ ను సబ్స్క్రైబ్ చేసుకొని థియేటర్లలో విడుదలైన ఎన్నో చిత్రాలను ఇంట్లో కుటుంబంతో కలిసి చూస్తూ ఎంజాయ్ చేయడమే కాకుండా డబ్బును కూడా ఆధా చేసుకుంటున్నారు.
అందులో భాగంగానే అటు థియేటర్లలో విడుదలైన సినిమాలు నెల తిరగకుండానే ఓటీటీలోకి వచ్చి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక బాలీవుడ్ మూవీ కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అయిపోయింది. ఆ చిత్రం ఏదో కాదు బాఘీ 4. థియేటర్లలో విడుదలయి ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించడానికి సిద్ధం అవుతోంది. విషయంలోకి వెళ్తే.. టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) , సోనమ్ బజ్వా (Sonam Bajwa) జంటగా నటించిన బాలీవుడ్ చిత్రం బాఘీ 4. ఈ ఏడాది సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఇప్పుడు సడన్ గా స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది..
ప్రస్తుతం రెంటల్ పద్ధతిలో అందుబాటులోకి వచ్చింది. రూ.349 అదనంగా చెల్లించి ఈ సినిమాను చూడొచ్చని ఆ సంస్థ స్పష్టం చేసింది. మరి ఉచితంగా చూడాలంటే సబ్స్క్రైబర్లు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే వరకు ఆగాల్సిందే. ఏ హర్ష తెరకెక్కించిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.
ALSO READ:Bigg Boss 9 Promo: ఫిజికల్ ఛాలెంజ్.. ఆ ఇద్దరూ సరైన వ్యక్తులే.. కానీ!
యాక్షన్ థ్రిల్లర్ మూవీగా నదియాద్వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాజిద్ నదియాద్వాలా నిర్మించిన ఈ చిత్రానికి ఏ హర్ష దర్శకత్వం వహించారు. బాఘీ సినిమా సీరీస్ లో ఇది నాల్గవ భాగం. టైగర్ ష్రాఫ్ , సంజయ్ దత్, సోనం బజ్వా, హర్నాజ్ సంధు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇకపోతే తెలుగులో భీమా సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు హర్ష ఈ సినిమాను తెరకెక్కించారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా బాఘీ2లో దిశా పటానీ హీరోయిన్ గా నటించింది. బాఘీ 3లో కూడా టైగర్, శ్రద్ధా కపూర్ నటించారు. అయితే బాఘీ 4లో ఈ హీరోయిన్స్ ఎవరూ లేకపోవడం గమనార్హం.