Rajisha Vijayan (Image Credit: Instagram)
ప్రముఖ బ్యూటీ రజీషా విజయన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. టీవీ హోస్ట్‌గా తన కెరీర్ ను ఆరంభించిన ఈమె.. 2016లో వచ్చిన మలయాళ సినిమా 'అనురాగ కరిక్కిన్ వెళ్లం' అనే చిత్రం ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. అందులో ఉత్తమ నటన కనబరిచినందుకుగాను ఈమెకు ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు కూడా లభించింది.

Rajisha Vijayan (Image Credit: Instagram)
అలా వరుసగా మలయాళ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె..మలయాళంలో వచ్చిన జూన్ సినిమాను తెలుగులో హలో జూన్ అంటూ 2019లో విడుదల చేశారు. అలా ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

Rajisha Vijayan (Image Credit: Instagram)
తమిళ్ , మలయాళం అంటూ ప్రేక్షకులను అలరించిన రజీషా 2021లో సూర్య హీరోగా నటించిన జై భీమ్ సినిమాతో మరోసారి అందరి దృష్టిని ఆకట్టుకుంది.

Rajisha Vijayan (Image Credit: Instagram)
ఇంకా రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో నేరుగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయింది.

Rajisha Vijayan (Image Credit: Instagram)
అందులో భాగంగానే ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న కొన్ని ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఎండిపోయిన చెట్ల మధ్య గ్లామర్ వలకబోస్తూ రెడ్ డ్రెస్ లో సెగలు పుట్టిస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

Rajisha Vijayan (Image Credit: Instagram)
ఇందులో అమ్మడి అందానికి అభిమానులు ఫిదా అవుతూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ.. అమ్మడిపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.