Rambha Daughter Photos: 1990ల్లో హీరోయిన్ రంభకు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఇప్పుడు తన కూతురిని చూస్తుంటే తనకు కూడా హీరోయిన్ అయ్యే లక్షణాలు చాలానే ఉన్నాయని నెటిజన్లు ఫీలవుతున్నారు.
ప్రస్తుతం సినీ పరిశ్రమ నుండి పూర్తిగా దూరమయినా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తుంటుంది రంభ.
అలాగే తాజాగా ఫ్యామిలీతో కలిసి ట్రిప్‌కు వెళ్లిన రంభ.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా చాలామంది దృష్టి తన కూతురిపై పడింది.
రంభకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. తను తాజాగా షేర్ చేసిన ఫ్యామిలీ ఫోటోల్లో పెద్ద కూతురు చాలా అందంగా ఉందంటూ తన గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ఫాలోవర్స్.
మామూలుగా హీరో, హీరోయిన్లు తమ వారసులను కూడా సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయ్యేలా చేస్తారు. కానీ రంభ అలా కాదు.
2008లో సినిమాలకు దూరమయిన రంభ.. 2010లో ఇంద్రకుమార్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వెంళ్లి టోరంటోలో సెటిల్ అయ్యింది. దీంతో సినీ పరిశ్రమతో తనకు ఉన్న అనుబంధం పూర్తిగా తెగిపోయింది.
అప్పుడప్పుడు తన ఫ్యామిలీతో, తన పిల్లలతో సమయాన్ని కేటాయిస్తూ వాటిని ఫోటోలు తీసి ఫాలోయిర్స్‌తో పంచుకుంటుంది రంభ.
అలాగే తాజాగా ఫ్యామిలీతో బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు షేర్ చేసింది. అందులో తన కూతురిని చూసి తను కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తే రంభలాగానే ఫేమ్ సంపాదించుకోలగదు అని ఫాలోవర్స్ అభిప్రాయపడుతున్నారు.
వెండితెరకు దూరమయిన తర్వాత బుల్లితెర ప్రేక్షకులను అలరించింది రంభ. కొన్నాళ్లు పాటు బుల్లితెర షోలలో జడ్జిగా వ్యవహరించింది.
తెలుగు సినిమాలకు దూరమయిన తర్వాత కూడా ఇతర సౌత్ భాషల్లో చిన్నచిన్న పాత్రల్లో అలరించింది రంభ.