Gundeninda Gudigantalu : తెలుగు బుల్లి తెరపై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్లలో గుండె నిండా గుడిగంటలు ఒకటి.. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ఈ సీరియల్ ప్రసారమవుతుంది. ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న టాప్ టెన్ సీరియల్స్లలో ఈ సీరియల్ కూడా ఒకటి. మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళకి డబ్బులు మీద ఆశ ఉంటే ఎలా ఉంటుంది అన్నది ఈ సీరియల్ స్టోరీ. డబ్బున్న కోడల్ని ఒకలాగా లేని కోడల్ని మరొకలాగా చూసే అత్త ఎలా ఉంటారు అన్నది ఈ సీరియల్లో కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. అందుకే టాప్ రేటింగ్ తో ఈ సీరియల్ దూసుకుపోతుంది. ఇందులో హీరోయిన్ గా నటించిన మీనా అలియాస్ అమూల్య గౌడ లవ్ స్టోరీ గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఆమె లవ్ స్టోరీ గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
అమూల్య గౌడ గుడి నిన్న గుడి గంటలకన్నా ముందు కార్తీకదీపం సీరియల్ లో శౌర్య పాత్రలో నటించింది. అప్పట్లో ఈ పాత్రకు మంచి డిమాండే ఉనింది. తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది అమూల్య. ఇప్పుడు మెయిన్ లీడ్ పాత్రలో గుండె నిండా గుడి గంటల్లో నటిస్తుంది. ఎన్నెన్నో జన్మలబంధం, సత్యభామ సీరియల్ హీరో నిరంజన్ తో ప్రేమలో పడిన విషయం తెలిసిందే.. వీరిద్దరూ కలిసి కమల అనే సీరియల్ లో నటించారు. ఈ సీరియల్ టైమ్ లో ఏర్పడిన స్నేహం రియల్ లైఫ్ లోనూ కొనసాగుతోంది. స్మాల్ స్క్రీన్ పై బెస్ట్ రొమాంటిక్ జోడీగా అవార్డులు కూడా అందుకున్నారు. ఈ సీరియల్ టైంలోనే ఎన్నో ట్విస్ట్ లతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే వివిధ పెళ్లి చేసుకున్నారా లేదా అన్న విషయం పై క్లారిటీ అయితే రాలేదు కానీ కలిసున్నారన్న విషయం మాత్రం అందరికీ తెలుసు..
Also Read: బిగ్ బాస్ 9 మాస్క్ మ్యాన్ అవుట్.. నాలుగు వారాల రెమ్యూనరేషన్ ఎంతంటే..?
మైసూర్ కి చెందిన అమూల్య గౌడ పదేళ్ల క్రితం కన్నడ సీరియల్ స్వాతిముత్తుతో నటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత నటించిన కమలి సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పునర్ వివాహ, ఆరామనే సీరియల్స్ చేసింది. అందం, నటనంతో కన్నడ స్మాల్ స్క్రీన్ పై మంచి ఫాలోవర్స్ ని ఏర్పరుచుకుంది. కార్తీకదీపం సీరియల్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రస్తుతం గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో నటిస్తుంది. ఈ సీరియల్ ద్వారా ఈమె బాగానే రెమ్యూనిరేషన్ ని అందుకుంటుంది. నెలకు 15 లక్షల వరకు ఈ సీరియల్ ద్వారా సంపాదిస్తుందంటే మామూలు విషయం కాదు.. ఇక సీరియల్ ద్వారా మాత్రమే కాదు అటు సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటున్న ఈమె లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారు మతిపోగొడుతుంది. ఇకపోతే ఈమెకు హీరోయిని మించిన ఫాలోయింగ్ సోషల్ మీడియాలో ఉంది.